AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Horoscope: అనుకూలంగా నాలుగైదు గ్రహాలు.. ఈ నెలంతా అదృష్టవంతులు వీళ్లే!

Telugu Astrology: ఈ నెలలో నాలుగైదు గ్రహాలు కొన్ని రాశుల వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ధనపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఈ రాశులవారిని అత్యంత అదృష్టవంతులుగా వీరిని పరిగణనలోకి తీసుకోవడానికి వీలుంది. ఈ రాశులవారు చేపట్టే ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆశించిన సహాయ సహకారాలు అన్ని వైపుల నుంచి లభిస్తాయి. సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

Lucky Horoscope: అనుకూలంగా నాలుగైదు గ్రహాలు.. ఈ నెలంతా అదృష్టవంతులు వీళ్లే!
Lucky Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 14, 2024 | 7:07 PM

Share

ఈ నెలలో నాలుగైదు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం. మీనం. అందువల్ల ధనపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఈ రాశులవారిని అత్యంత అదృష్టవంతులుగా వీరిని పరిగణనలోకి తీసుకోవడానికి వీలుంది. ఈ రాశులవారు చేపట్టే ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆశించిన సహాయ సహకారాలు అన్ని వైపుల నుంచి లభిస్తాయి. సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

  1. మేషం: ఈ రాశికి కుజ, శుక్ర, శని, గురువు, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆశించిన స్థాయి జీత భత్యాలు లభిస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు సమసి పోతాయి. రాదనుకున్నడబ్బు కూడా చేతికి అందుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. వీరి ఆనందానికి అవధులుండవు. వృత్తి, వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి సాధిస్తారు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి గురువు, బుధుడు, రవి, చంద్ర, కేతువులు అనుకూలంగా ఉండడంతో ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. రాజకీయ నాయకులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. సొంతంటి కల నెరవేరడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగు తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు తొలగిపోతాయి. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు.
  3. కన్య: ఈ రాశివారికి శుక్రుడు, శని, రవి, కుజుడు, గురువు అనుకూలంగా మారినందువల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించే అవకాశం ఉంది. ఏ పని లేదా ఏ ప్రయ త్నం తలపెట్టినా సులువుగా పూర్తవుతుంది. ఉద్యోగంలో ఏ బాధ్యతనైనా అద్భుతంగా నిర్వర్తి స్తారు. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. సమాజంలో రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కుబేరుడి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బుకు లోటుండదు.
  4. వృశ్చికం: ఈ రాశివారికి గురు, శుక్ర, శని, రవి, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబంలో చాలా కాలంగా తిష్ఠ వేసుకున్న సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అన్ని వైపుల నుంచి ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచ నాలను మించుతాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది.
  5. మకరం: ఈ రాశివారికి శని, శుక్ర, బుధ, రవి, గురువుల అనుకూలత వల్ల చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులన్నీ పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరు గుతుంది. ఆదాయావకాశాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకుం టారు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు.
  6. మీనం: ఈ రాశికి గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి అనుకూలంగా ఉండడంతో ఉద్యోగంలో పదోన్నతులతో పాటు వేతనాలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా బాగా బలపడతారు. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలపరంగా దూసుకు పోతారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కార మవుతాయి. సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.