కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..
Kartika Purnima
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2024 | 4:05 PM

కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలుగు వారు నదీ స్నానం దీపదానం శివ పూజను చేస్తారు. ఉసిరి దీపాలు పెట్టి దానం ఇస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమిని ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ దీపావళి పండగ వెళ్ళిన 15 రోజుల తర్వాత కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని దేవతల దీపావళి అంటారు. ఈ రోజున దేవతలు స్వర్గం నుండి భూమికి దిగివచ్చి గంగా నది తీరం వద్ద దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకుంటారని నమ్ముతారు.

దేవ దీపావళి రోజున వారణాసి ఘాట్‌లను లక్షలాది దీపాలతో అలంకరించారు. గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్‌లు ఈ రోజున ఆకాశంలో నక్షత్రాలు నేల దిగి వచ్చినట్లు అత్యంత ప్రకాశంతో మెరిసిపోతాయి. దీపాల వెలుగుతో నక్షత్రాలు భూమిపైకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం వారణాసి అందాన్ని మరింత పెంచుతుంది. భక్తులు దీనిని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. దేవ దీపావళి రోజున శివుడిని, శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో డబ్బులకు, ధాన్యాలకు కొరత ఉండదు.

కార్తీక పౌర్ణమి 2024 తేదీ

ఇవి కూడా చదవండి

పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం దేవ దీపావళి నవంబర్ 15 న జరుపుకుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి

కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. వీలైతే ఈ రోజున గంగాస్నానం చేసి అనంతరం దీపదానం చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం.

కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈ రోజు ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటండి.

కార్తీక పౌర్ణమి రోజున, తులసి మొక్కకు పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి కలుగుతుందని నమ్మకం.

కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారయణ కథను పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సత్యనారయణ భగవానుని కథను పఠించడం లేదా వినడం ద్వారా భక్తులకు అన్ని రకాల కష్టాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని 11 తులసి దళాలతో పూజించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఎప్పుడూ ధన ధాన్యాలకు కొరత ఉండదని.. ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.

కార్తీక పౌర్ణమి రోజున, 11 పిండి దీపాలను తయారు చేసి.. ఆ దీపాలను స్వచ్ఛమైన దేశీ నెయ్యితో నింపండి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇంట్లోని పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర 11 మట్టి దీపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!