- Telugu News Photo Gallery Spiritual photos Do Puja for Lord Shiva on Kartika Purnami like this to get rid of debt and solve many problems
కార్తీక పౌర్ణమి రోజున శివయ్యకు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుందో తెలుసా..
కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో ప్రతి రోజూ పవిత్రమైనదే. నదీ స్నానం, దానాలు, పూజలు అన్నీ శుభాలను ఇచ్చేవే. అయితే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిధులు అత్యంత విశిష్టమైనవి,పవిత్రమైనవి. హిందువులు కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున శివుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. శివుడి అనుగ్రహం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. అయితే ఎవరైనా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో ఉంటే భోలాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేసి చూడండి..
Updated on: Nov 14, 2024 | 3:54 PM

కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి దానం చేయడంతో పాటు శివుడిని పూజించడం కూడా శుభాలను ఇస్తుంది. అంతేకాదు ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తే కోటి జన్మల ఫలం దక్కుతుందని నమ్మకం. ఇక శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని లింగానికి అభిషేకం చేయడం వలన దరిద్రం తొలగిపోతుంది.. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున శివలింగానికి ఏ సమస్యకు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే పరిష్కారం లభిస్తుందో తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి దీప దానం చేయడం వలన సకల పాపాలు హరించుకునిపోతాయి. అంతేకాదు పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటిని దీపాలతో అలంకరించి శివుడికి పూజ చేయడం శివయ్య ఆశీర్వాదంతో సిరి సంపదలు కలుగుతాయి.. కష్టాలు తొలగుతాయి.

జలాభిషేకం: శివయ్య అభిషేక ప్రియుడు. కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే కాదు నిత్యం ఎవరినా శివయ్యకు గంగాజలంతో కానీ లేదా జలంతో కానీ అభిషేకం చేయడం వలన శివయ్య అనుగ్రహం లభిస్తుంది. పరమశివుడు ప్రసన్నం అయ్యి కష్టాల నుంచి బయట పడేస్తాడు. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది.

ఆవు పాలతో అభిషేకం: ఎవరికైనా చేపట్టిన పనులు పూర్తి కాకుండా ఆటంకాలు ఏర్పడుతుంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం శుభఫలితాలను ఇస్తుంది. సర్వసౌఖ్యలు లభిస్తాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనీ అనుకునే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది.

భష్మాభిషేకం: శివయ్యకు భస్మం అంటే చాలా ఇష్టం.. ఎవరైనా లింగానికి భస్మం కలిపిన జలంతో అభిషేకం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలకు పరిహారం లభిస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు.

ఆవు పెరుగుతో అభిషేకం: శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయడం ఫలవంతం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతువారు కార్తీక పౌర్ణమి రోజు శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన ఆ జబ్బుల నుంచి విముక్తి లభిస్తుంది.

చెరుకు రసంతో అభిషేకం: శివుడికి చెరకు రసంతో కానీ పంచదారతో అభిషేకం చేయడం వలన దు:ఖం నుంచి విముక్తి లభిస్తుంది. అప్పులతో బాధపడుతున్నవారు అప్పులన్నీ తీర్చి రుణ విముక్తులు అవుతారు.

బిల్వపత్ర జలంతో అభిషేకం: శివుడికి బిల్వపత్రాలు అంటే అత్యంత ఇష్టం. పరమశివుడికి బిల్వపత్రాలు వేసిన జలంతో అభిషేకం చేసినట్లు అయితే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.




