AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gita Jayanti: పుట్టిన రోజు జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత.. ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడు? పూజ, ప్రాముఖ్యత ఏమిటంటే

హిందూ మతంలో గీతా జయంతి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడని విశ్వాసం. ఈ ఏడాది గీతా జయంతి తేదీ.. ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

Gita Jayanti: పుట్టిన రోజు జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత.. ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడు? పూజ, ప్రాముఖ్యత ఏమిటంటే
Gita Jayanti
Surya Kala
|

Updated on: Nov 14, 2024 | 3:34 PM

Share

గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన శుభ దినం. గీతా జయంతిని హిందూ పంచాంగం ప్రకారం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని కూడా అంటారు. ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ రోజున శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడని చెబుతారు. అందువల్ల ఇది గీతాజయంతి. జన్మదినోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఈ రోజున శ్రీ కృష్ణుడిని, వేద వ్యాసుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రీ మద్భగవద్గీత పారాయణం చేయడం వల్ల మనిషి మనస్సు శుద్ధి అవుతుందని.. జీవితంలో సుఖ శాంతులు నెలకొంటాయని నమ్మకం.

గీతా జయంతి తేదీ ఎప్పుడంటే

మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 11 డిసెంబర్ 2024 ఉదయం 3.42 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:09 గంటలకు ముగుస్తుంది. దీంతో ఈ ఏడాది జయంతి వేడుకలను కొంతమంది డిసెంబర్ 11న మరికొందరు డిసెంబర్ 12వ తేదీన గీతా జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గీత 5161వ జయంతి.

ఇవి కూడా చదవండి

గీతా జయంతి ప్రాముఖ్యత

గీతా జయంతి రోజున శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీర యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర యుద్ధం పాండవులు, కౌరవుల మధ్య జరిగింది. ఇందులో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మ, కర్మ సిద్దాంతాన్ని చెప్పడం ద్వారా అర్జునుడి మనోబలాన్ని పెంచాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాల గురించి మానవులకు వివరణాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం, గీతా పఠించడం ఆధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది. జీవితంలో సానుకూలతను కూడా తెస్తుంది.

గీతా జయంతి పూజ విధి

గీతా జయంతి రోజున స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. దీని తరువాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. పూజ సమయంలో శ్రీమద్ భగవద్గీత పఠించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అక్షతలు, పుష్పాలతో పూజించండి. అనంతరం భగవద్గీత పారాయణం ప్రారంభించండి. అలాగే శ్రీకృష్ణుని పూజించండి. ఈ రోజున ప్రజలు భగవద్గీత పుస్తకాన్ని దానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.