AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indigo Flight: మళ్ళీ విమానానికి బాంబు బెదిరింపు.. రాయ్‌పూర్‌లో ఎమర్జెనీ ల్యాండింగ్.. కొనసాగుతున్న దర్యాప్తు..

మన దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఈ విమానం బాంబు బెదిరింపుతో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Indigo Flight: మళ్ళీ విమానానికి బాంబు బెదిరింపు.. రాయ్‌పూర్‌లో ఎమర్జెనీ ల్యాండింగ్.. కొనసాగుతున్న దర్యాప్తు..
Indigo Flight Bomb Threat
Surya Kala
|

Updated on: Nov 14, 2024 | 3:10 PM

Share

భారత్‌లో విమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మరో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ఈ చర్య తీసుకున్నారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందిన వెంటనే ముందుజాగ్రత్తగా రాయ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. తక్షణమే భద్రతా చర్యలు చేపట్టారు.

బాంబు గురించి సమాచారం అందిన వెంటనే విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి విమానాన్ని తరలించారు. అనంతరం బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించి విచారణ చేస్తున్నారు.

కొనసాగుతోన్న కేసు దర్యాప్తు

ఇవి కూడా చదవండి

విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కొద్దిసేపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానంలో దర్యాప్తు కొనసాగుతోంది. అంతేకాదు అసలు ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నారు. బాంబు బెదిరింపు రావడంతో 187 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందిని వెంటనే విమానాశ్రయంలో దింపినట్లు రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ సింగ్ తెలిపారు. తప్పనిసరి భద్రతా తనిఖీలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించి ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తీసుకుని వచ్చారు. అనంతరం విమానాన్ని పరిశీలిస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్న అంతర్జాతీయ ఏజెన్సీలు

వరస బాంబు బెదిరింపు ఘటనలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పందించారు. వరసగా వస్తున్న ఈ నకిలీ బెదిరింపులను ఆపడానికి అంతర్జాతీయ ఏజెన్సీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో బృందాలు ఈ విషయంపై దృష్టి పెట్టాయని చెప్పారు. ఈ బృందాలు నిరంతరం పరిశీలిస్తున్నాయన్నారు. అంతేకాదు దీనితో పాటు విమానయాన చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు