AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ శాంతి కోసం కంచి కామకోటి ఆధ్వర్యంలో రుద్రయాగం.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎం యోగి

కంచి కామకోటి పీఠం ఆధ్వంర్యంలో సనాతన ధర్మం, ప్రపంచ శాంతి, సార్వత్రిక సంక్షేమం కోసం 45 రోజుల గొప్ప ఆధ్యాత్మిక మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు.

ప్రపంచ శాంతి కోసం కంచి కామకోటి ఆధ్వర్యంలో రుద్రయాగం.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎం యోగి
Cm Yogi
Balaraju Goud
|

Updated on: Nov 16, 2024 | 3:00 PM

Share

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచి కామకోటి పీఠం మణి జీని కలిశారు. కరసేవకపురంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. శ్రీమహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగం, శ్రీరామ యంత్రానికి సంబంధించిన వివరానలను వివరించారు ముఖ్యమంత్రి యోగి. ఈ నెలాఖరులో మరోసారి అయోధ్యనను సందర్శించనున్నట్లు సీఎం యోగి వెల్లడించారు. కంచి కామకోటి ఆధ్వర్యంలో నిర్వమించే యాగంలో ముఖ్యమంత్రి యోగి గడపనున్నారు.

కరసేవకపురంలో నిర్వహించనున్న రథయాత్ర, అన్నదానం, యాగం గురించిన సమాచారాన్ని అయోధ్యలోని సమీప జిల్లాలన్నింటికీ ప్రచారం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేయాలని అయోధ్య తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను సీఎం యోగి ఆదేశించారు. చండీ యాగం పూర్తయిన తర్వాత అయోధ్యలోని శ్రీరామ మందిరంలో శ్రీరామ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షత్ర ట్రస్టు ట్రస్టుతో మాట్లాడతానని సీఎం హామీ ఇచ్చారు. కలియుగంలో తొలిసారిగా జరిగే ఈ దివ్య మహా యాగంలో అందరి సహకారం, భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని రుద్ర సహిత శత సహస్ర్ చీఫ్ కోఆర్డినేటర్ ధన్యవాద్ జీ DSN మూర్తి తెలిపారు.

అంతకు ముందు కంచి కామకోటి పీఠం ప్రతినిధులు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యలో రామమందిరంలో రామయంత్రం ఏర్పాటుకు, మహాయజ్ఞం విజయవంతంగా నిర్వహించేందుకు సంఘ్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మోహన్ భగవత్ హామీ ఇచ్చారని డీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. యాగం జరుగుతున్న 45 రోజుల పాటు వ్యక్తిగతంగా అయోధ్యలో ఉండేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

కంచి కామకోటి పీఠం ఆధ్వంర్యంలో సనాతన ధర్మం, ప్రపంచ శాంతి, సార్వత్రిక సంక్షేమం కోసం 45 రోజుల గొప్ప ఆధ్యాత్మిక మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ యాగం ద్వారా, ప్రపంచం మొత్తం ఆనందం, శ్రేయస్సు కోసం రుద్ర భగవానుడు, చండీ దేవి ఆశీర్వాదం కోరనున్నారు. భారతదేశం అంతటా 1200 మందికి పైగా వేద ఋత్విక్కులు పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి, సానుకూల శక్తిని ప్రేరేపించడానికి పురాతన కర్మలో పాల్గొంటున్నారు.

కామాక్షి దేవి ఆలయం భారతదేశంలోని పన్నెండు ప్రధాన దేవత విగ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. జ్యోత్తిర్లింగాల్లో ఒకటిగా కొలుస్తారు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ, శారదా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం కనుల అందానికి ప్రసిద్ధి చెందింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…