Viral Video: ఇళ్లలోని మురికిని ఫ్రీగా శుభ్రం చేస్తుంది.. నేడు కోటీశ్వరురాలు.. ఎలాగంటే
చేసే ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాదు.. డబ్బు సంపాదించాలంటే చేస్తున్న ఉద్యోగాన్ని గౌరవించాలి. కష్టపడి పని చేయాలి. అవకాశం వచ్చే వరకూ ఓపికగా ఉండాలి. ఇది పెద్దలు చెప్పే మాట.. దీనిని జీవితంలో అన్వయించుకున్న ఓ యువతి చెత్త ఏరుతూ కోట్లు సంపాదిస్తోంది. ఫిన్‌లాండ్‌కు చెందిన ఆరి కనరీన్ తన అభిరుచి ఆధారంగా కోటీశ్వరురాలిగా మారింది.
బాగా డబ్బులు సంపాదించాలంటే బాగా చదువుకోవాలని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల చెబుతూ ఉంటారు. ఈ విషయం ఎక్కువ మందికి అనుభవమే.. అయితే ధనవంతులు కావాలనుకుంటే డిగ్రీ గి ఉండాల్సిన అవసరం లేదని కొంతమంది యువతీ యువకులు నిరూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది తమ నైపుణ్యాల ఆధారంగా కోటీశ్వరులుగా మారారు. ప్రపంచం ముందు తమ సొంత టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఓ అమ్మాయి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె తన సొంత తెలివి తేటలతో కోటీశ్వరురాలు అయింది.
వాస్తవంగా డబ్బులు సంపాదించాలనుకుంటే అవకాశాల కోసం వెదకాలి.. అది చేస్తా ఇది చేస్తా అనే కండిషన్స్ పెట్టకూడదు. చిన్న పెద్ద పని అని ఎంచకూడదు. దొరికిన పనిని దైవంగా భావించి కష్టపడాలి.. ఈ విషయాన్నీ ఫిన్‌లాండ్‌కు చెందిన ఔరి దృష్టిలో పెట్టుకుంది. తనకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తూ ఇప్పుడు కోటీశ్వరురాలిగా మారింది. ఇప్పుడు ఆ యువతిని సోషల్ మీడియాలో 10 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
ఆ యువతి ప్రజల ఇళ్లను ఫ్రీగా శుభ్రపరుస్తుంది. అయితే ఆమె నికర విలువ నేడు లక్షల్లో ఉంది. ఆ యువతి తాను చేసే పనికి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చేసినప్పుడు.. ఇంత డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి.. అని ఆశ్చర్యపోతారు ఆ యువతి గురించి తెలియని వారు. మీడియా నివేదికల ప్రకారం, ఔరి క్లీన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ప్రభావశీలులు ఉన్నట్లే.. స్వచ్చంగా శుభ్రం చేసే ప్రభావశీలులు కూడా ఉన్నారు. వీరు ఇతరుల ఇళ్లకు వెళ్లి ఆ ఇంటిని శుభ్రం చేస్తారు. చెత్తను ఊడుస్తారు. మురికిని ఎత్తారు.. ఇలా తాము ఇంటిని శుభ్రం చేసే సమయంలో చేసే పనిని వీడియోలుగా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటారు.
ఇలా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వలన వారు భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. ఈరోజు ఔరీ సంపాదన గురించి చెప్పాలంటే.. ఆ యువతికి కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఔరీ చేసిన పనిని చూస్తారు.. వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తారు. ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఔరీ ఇంతకు ముందు ఒక కంపెనీలో క్లీనింగ్ సూపర్‌వైజర్‌గా పని చేసింది. తరువాత ఆమె సొంతంగా క్లీనింగ్ పనిని ప్రారంభించింది. అది కూడా ఫ్రీగా శుభ్రం చేస్తుంది. ఇలా ఇళ్ళకు శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు అందుకు తగిన దుస్తులు ధరిస్తుంది. స్వయంగా ఇళ్లను కనుగొని వాటిని శుభ్రం చేస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..