AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: కీలక నిర్ణయం తీసుకున్న సిట్‌.. రేవంత్‌ రెడ్డితో సహా మరికొందరికి నోటీసులు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) దూకుడు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేసింది...

TSPSC: కీలక నిర్ణయం తీసుకున్న సిట్‌.. రేవంత్‌ రెడ్డితో సహా మరికొందరికి నోటీసులు.
Revanth Reddy
Narender Vaitla
|

Updated on: Mar 20, 2023 | 2:30 PM

Share

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) దూకుడు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేసింది. పేపర్‌ లీక్‌కు పాల్పడిన వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. విచారణ జరుగుతున్నా కొద్దీ నిజాలు బయటపడుతూనే ఉన్నాయి.

ఇక ఓవైపు ఇన్వెస్టిగేషన్‌ సాగుతుంటే మరోవైపు రాజకీయంగానూ ఈ అంశం దుమారం రేపుతోంది. రాజకీయల నేతలు పేపర్‌ లీక్‌లపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ల లీక్ వెనుక కేటీఆర్, ఆయన పీఏ ఉన్నాడంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు, మరికొందరు రాజకీయ నాయకులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతో సిట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై ఆరోపణలు చేస్తోన్న వారికి సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీ కేసులో వారు చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. వారి వద్ద ఉన్న సమాచారాన్ని తమకు తెలియజేయాలని సిట్ నోటీసుల్లో కోరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు రాజకీయ నాయకులు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ల లీక్‌పై రేవంత్ రెడ్డి వద్ద ఉన్న సమాచారాన్ని తమకు ఇవ్వాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే పేపీర్‌ లీకేజీలో కేటీఆర్‌ పీఏ తిరుపతి భాగస్వామ్యం ఉందని, అతని గ్రామంలో వందమంది అభ్యర్థులకు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌