TSPSC Paper Leak: హైకోర్టును ఆశ్రయించిన ‘టీఎస్పీఎస్సీ’ నిందితుడి సతీమణి.. కారణం ఏమిటంటే..?
తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని సుచరిత పిటిషన్ ద్వారా సదరు కోర్టును కోరారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు..
ఇటీవల తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు నిందితుడు రాజశేఖర్ సతీమణి సుచరిత రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె తన పిటీషన్‌లో పేర్కొన్నారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని సుచరిత పిటిషన్ ద్వారా సదరు కోర్టును కోరారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిపిన విచారణను వీడియోలో చూపించాలని సుచరిత విన్నపించారు. మరోవైపు సుచరిత తన పిటీషన్‌లో ప్రతివాదులుగా తెలంగాణ డీజీపీ, చీఫ్ సెక్రటరీ,సిట్ అధికారులు, హైదరాబాద్ సిటీ డీసీపీల పేర్లను చేర్చారు.
పదేపదే సీన్ రికన్‌స్ట్రక్షన్ చేస్తున్న సిట్ అధికారులు..
ఇంతకముందు అంటే 18వ తేదీన టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో క్రైమ్ రికన్‌స్ట్రక్షన్ చేసిన సిట్ అధికారులు.. ఈ రోజు మరోసారి చేశారు. ఈ మేరకు కేసులో నిందితులుగా ఉన్న రాజశేఖర్, ప్రవీణ్‌తో కలిసి టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్‌లను పరిశీలించారు. అనంతరం కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి తీసుకెళ్లి ఏమేం చేశారని సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ తరుచూ మాట మారుస్తుండటంతో మరోసారి సీన్ రికన్‌స్ట్రక్షన్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం