టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్.. బస్సుతో పాటు శ్రీవారి దర్శనం టికెట్. ఈ సేవలను ఎంత మంది ఉపయోగించుకున్నారో తెలుసా.?
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం నెలల నుంచే ప్లానింగ్ చేసుకుంటారు. ప్రత్యేక దర్శనం టికెట్ కోసం కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తుంటారు. తీరా నెలవారీ కోటా విడుదల చేసిన సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కోట వెంటనే ముగిసి పోతుంది. అయితే..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం నెలల నుంచే ప్లానింగ్ చేసుకుంటారు. ప్రత్యేక దర్శనం టికెట్ కోసం కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తుంటారు. తీరా నెలవారీ కోటా విడుదల చేసిన సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కోట వెంటనే ఖాళీ అవుతోంది. అయితే ఇలా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. తిరుపతికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి సులభంగా దర్శనం పొందే అవకాశాన్ని అందించింది.
ప్రతి రోజు 1000 మంది ప్రయాణికులకు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. ప్రయాణికులు బస్సు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్ సైతం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయమై తాజాగా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. మార్చి 18వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించినట్లు గోవర్ధన్ తెలిపారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా దర్శనం టికెట్ పొందాలంటే నెలలు తరబడాల్సి ఎదురు చూడాల్సి వస్తుందని, అదే తెలంగాణ ఆర్టీసీ ద్వారా కేవలం వారం రోజుల్లో దర్శనం టికెట్లు పొందొచ్చని పేర్కొన్నారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో తిరుపతికి సౌకర్యవంతమైన బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని గోవర్ధన్ సూచించారు.