- Telugu News Photo Gallery Cricket photos Indian Cricket Team players one by one offering prayers at Ujjain Mahakaleshwar Temple, See Viral Pics
Team India: అప్పుడు సూర్య, కోహ్లీ, రాహుల్.. ఇప్పుడు ఉమేష్ యాదవ్ వంతు.. వైరల్ అవుతున్న టీమిండియా క్రికెటర్ల ఫోటోలు..
Team India: ఇటీవలి కాలంలో ఆ ఆలయానికి వెళ్లి వచ్చిన టీమిండియా క్రికెటర్లు మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆ ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు. అసలు ఆ ఆలయమేమిటో.. ఎవరెవరు దానిని సందర్శించారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 20, 2023 | 2:55 PM

టీమిండియా క్రికెటర్లు పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న సమయంలో తరచూ దేవుడిని ఆశ్రయించడం సర్వసాధారణం. అయితే ఇటీవలి కాలంలో ఆ ఆలయానికి వెళ్లి వచ్చిన టీమిండియా క్రికెటర్లు మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆ ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు.

వాస్తవానికి, ఆ ఆలయ సందర్శన సూర్యకుమార్ యాదవ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత కోహ్లీ, అనంతరం కేఎల్ రాహుల్ కూడా ఆ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా చేరాడు. ఇంతకి వారు సందర్శిస్తున్న అలయం మరేదో కాదు.. సృష్టికి లయకారుడైన మహాశివుని ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం.

తాజాగా సోమవారం మహాకాళేశ్వర భస్మ హారతిలో పాల్గొన్న ఉమేష్ దేవుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇప్పుడు మహాదేవుని దర్శనం పొందిన ఉమేష్ యాదవ్ కూడా.. త్వరలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇక అంతకముందు.. అంటే అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ తన మూడేళ్ల సెంచరీ కరువును ముగించాడు. అయితే ఈ సెంచరీకి ముందు కోహ్లీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించాడు.

కోహ్లి కంటే ముందు సూర్యకుమార్ కూడా గత జనవరిలో ఇక్కడకు వచ్చారు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు సూర్య మహాకాళేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నాడు. దీని తర్వాత కివీ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 47 పరుగులు చేశాడు.

ఫామ్ లేక టెస్టు టీమ్‌లో స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్ కూడా గత ఫిబ్రవరిలో మహాకాళేశ్వరాన్ని సందర్శించారు. రాహుల్ తన భార్య అథియాతో కలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పర్యటించిన తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 75 పరుగులు చేశాడు.




