- Telugu News Photo Gallery Cricket photos Team India registered their fourth lowest ODI scores against Australia
Team India: వన్డేల్లో టీమిండియా అత్యల్ప స్కోరు ఎంతో తెలుసా? ఆ దిగ్గజ ప్లేయర్ సారథ్యంలోనే చెత్త రికార్డు
విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో భారత జట్టు సాధించిన నాలుగో అత్యల్ప స్కోరు ఇది. అంతకు ముందు భారత్‌లో టీమిండియా మూడుసార్లు తక్కువ స్కోర్లు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Updated on: Mar 20, 2023 | 7:18 AM

శాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో భారత జట్టు సాధించిన నాలుగో అత్యల్ప స్కోరు ఇది. అంతకు ముందు భారత్‌లో టీమిండియా మూడుసార్లు తక్కువ స్కోర్లు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఇన్నింగ్స్‌లు ఏమిటో తెలుసుకుందాం రండి.

భారత్ vs శ్రీలంక: 1986లో కాన్పూర్‌లో జరిగిన వన్డేలో భారత్-శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 195 పరుగులు చేసింది. 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా కేవలం 78 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. స్వదేశంలో వన్డేల్లో భారత జట్టు అత్యల్ప స్కోరు ఇదే.

భారత్ vs వెస్టిండీస్: 1993లో అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 202 పరుగులకు ఆలౌటైంది, అయితే భారత్ 100 పరుగులకే ఆలౌటైంది.

భారత్ vs శ్రీలంక: 2017లో ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో శ్రీలంక జట్టు 20.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2000లో షార్జా వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్-శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఆతర్వాత సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక వన్డేల్లో భారత జట్టు అత్యల్ప స్కోరు ఇదే.




