AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fancy Number: ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే కూర్చొని పొందండిలా..!

కొందరు ఖరీదైన దుస్తులు, వాచీలు వంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రవర్తనతో ఆ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరు అయితే..

Fancy Number: ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే కూర్చొని పొందండిలా..!
Fancy Numbers
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 19, 2023 | 9:54 PM

Share

ప్రస్తుత సమాజంలో చాలా మంది సామాన్యులు కూడా వీఐపీలా లేదా ప్రత్యేకమైన వ్యక్తిలా గుర్తింపు పొందేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఖరీదైన దుస్తులు, వాచీలు వంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రవర్తనతో ఆ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరు అయితే ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ద్వారా వీఐపీగా గుర్తింపు పొందుతారు. అయితే ఇలాంటి వారి కోసమే వోడాఫోన్ ఐడియా ఒక శుభవార్త చెప్పింది. ఎటువంటి ఖర్చులేకుండా కూడా ఫ్యాన్సీ ఫోన్ నంబర్ సులువుగా దొరుకుతుంది. గతంలో అయితే ఈ ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్ల కోసం వేలంపాటలు జరిగేవి కానీ ఇప్పుడు అలా ఏమిలేదు. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (VI) తన వినియోగదారుల కోసం VIP నంబర్లని అందిస్తుంది.

అయితే ఇందుకోసం మీరు కొన్ని ప్రాథమిక ప్రక్రియలను తెలుసుకోవాలి. ఇది తెలిసిన వారికి ఫ్యాన్సీ సిమ్ నంబర్ ఉచితంగా లభిస్తుంది. కోరుకున్న ఫోన్ నంబర్‌ను పొందడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా వోడాఫోన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. కొత్త కనెక్షన్, ఆపై ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పిన్ కోడ్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఉచిత ప్రీమియం మొబైల్ నంబర్‌ల జాబితా నుంచి ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత మొబైల్‌ నెంబర్‌కి OTP వస్తుంది. అంతే కొత్త కనెక్షన్‌తో VIP నంబర్‌ వస్తుంది. ప్రస్తుతం వోడాఫోన్-ఐడియా ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ విధంగా వోడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు ఉచితంగా వీఐపీ నంబర్లను అందజేస్తోంది. దీని కోసం మీ నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. మీరు ఇలా ఇంటి నుంచే ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌ను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..