Watch Video: ఓరి నీ సరదా తగలెయ్యా..! మోడల్‌ ఫేమస్ కోసం మరీ ఇలా చేయ్యాలా..? వైరల్ అవుతున్న వీడియో..

ఫేమస్ అవుదామనే ఓ బాలుడు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘మోడల్ మోడల్’ అనే పాట మీకు

Watch Video: ఓరి నీ సరదా తగలెయ్యా..! మోడల్‌ ఫేమస్ కోసం మరీ ఇలా చేయ్యాలా..? వైరల్ అవుతున్న వీడియో..
Super Model
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 19, 2023 | 6:52 PM

ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరికతో చాలామంది చిన్నాపెద్దా తేడాలేకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఫేమస్ అవుతున్నారో లేదో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ ట్రోల్ అవుతుంటారు. అలాగే ఎందరో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలా ఫేమస్ అవుదామనే ఓ బాలుడు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘మోడల్ మోడల్’ అనే పాట మీకు తెలుసు కదా.. ఆ పాటకు స్టెప్పులేస్తూ ఆ బాలుడు చేసిన మోడల్ డ్యాన్స్ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది. అంతేకాక ఈ వీడియోలోని బాలుడిని నెటిజన్లు ‘మోడల్ బాయ్’ అంటూ కీర్తిస్తున్నారు కూడా.

అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో అసలు ఏం జరిగిందంటే..? మొదటిగా టీషర్ట్ ధరించి ఉన్నఅతను తర్వాత దానిపై ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుంటాడు. మళ్లీ దానిపైనే మరో జెర్కిన్ వేసుకుంటాడు. ఇక వీడియో మొదటి నుంచి స్పెక్స్‌తో ఉన్న ఆ బాలుడు దానిపైనే మరో రెండు కళ్లజోళ్లను కూడా పెట్టుకుంటాడు. ఇక ఇదంతా చేస్తున్నప్పుడు కూడా అతను మోడల్ మోడల్ పాటకు సరదా సరదా స్టెప్పులేస్తూ కాలు కదుపుతాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో babai_memess అనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ‘Tag Such model..’ క్యాప్షన్‌తో షేర్ అయింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి

‘మోడల్ బాయ్’ వీడియోను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by Babai Memes (@babai_memess)

కాగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ‘మోడల్ బాయ్’ వీడియోకు దాదాపు 21 లక్షలకు పైగా వీక్షణలు, అలాగే 1 లక్షా 18వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్‌గా ఉన్నావు..?’ అని కామెంట్ చేస్తున్నారు. అలాగే మరి కొందరు ‘అన్ని షర్టులు ఎందుకురా..?’ అని, ఇంకొందరు ‘మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచ్చేశాడ్రా బాబు..!’ అంటూ రాసుకొచ్చారు. ఇలా ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..