Andhra Pradesh: ప్రజా విజయం.. రాష్ట్రానికి శుభసూచకం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Mar 18, 2023 | 9:36 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి...

Andhra Pradesh: ప్రజా విజయం.. రాష్ట్రానికి శుభసూచకం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు..
Tdp

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన  పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు,నాయకులకు సెల్యూట్ అంటూనే.. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పుకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు.  ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసన మండలికి వెళుతున్న వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకున్న తెదేపా.. మూడో స్థానంలో కూడా విజయం సాధించింది.  ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ(కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా..  వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ రాకపోవడంతో, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు.

అలాగే అంతకముందు తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు.  దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన 3 చోట్ల కూడా.. ఆయా స్థానాలు టీడీపీ సొంతమయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu