మీ బ్యాంకు అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కి మార్చాలా..? ఇకపై బ్యాంక్‌కి వెళ్లకుండా, ఫోన్‌లోనే చేసుకోండిలా..!

సర్వసాధారణంగా మనలో చాలా మంది ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంకు బ్రాంచ్‌లో అకౌంట్‌ను కలిగి ఉండాలని భావిస్తారు. కానీ అనుకోని పరిస్థితులలో..

మీ బ్యాంకు అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కి మార్చాలా..? ఇకపై బ్యాంక్‌కి వెళ్లకుండా, ఫోన్‌లోనే చేసుకోండిలా..!
SBI Account Transfer
Follow us

|

Updated on: Mar 18, 2023 | 7:13 PM

భారతదేశ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. తమ ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు అనేక రకాల బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే దేశంలోని చాలా మంది ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారు. ఇంకా ఈ బ్యాంక్ ఖాతానే ఎక్కువ మంది కలిగి ఉండడానికి మరో ప్రధాన కారణమేమిటంటే.. అన్ని రకాల బ్యాంకింగ్ సేవలతో పాటు మినిమమ్ బ్యాలెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక ఎస్‌బీఐ బ్యాంకు దేశంలో అన్ని రకాల ప్రాంతాలలోనూ తన బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. అయితే సర్వసాధారణంగా మనలో చాలా మంది ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంకు బ్రాంచ్‌లో అకౌంట్‌ను కలిగి ఉండాలని భావిస్తారు. కానీ అనుకోని పరిస్థితులలో విద్యాఉద్యోగాల కారణంగా వేరే ప్రదేశానికి బ్రాంచ్‌ను మార్చుకోవలసి వచ్చే సందర్భాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ సమయంలో ఇంటికి దగ్గర ఉన్న బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్‌కు ఖాతాను మార్చుకోవాలని భావిస్తాం.

అందుకోసం బ్రాంచ్‌కు వెళ్లి పడిగాపులు కాపేవారు చాలా మంది గతంలో. అయితే ఎస్‌బీఐ కొత్తగా తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలతో ఆ సమస్య ఇప్పుడు లేదు. ఈ-సేవలతో ఉచితంగా ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కి వారం రోజుల్లోనే బదిలీ చేసుకోవచ్చు. అయితే దీని కోసం మీ మొబైల్ నంబర్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యి ఉండడంతో పాటు మీరు నెట్ బ్యాంకింగ్ యాక్సెస్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే కేవైసీ లేని బ్యాంకు ఖాతాలకు, యాక్టివ్‌గా లేని ఖాతాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఫోన్‌లోనే ఎలా మార్చుకోవాలంటే..? 

ఇవి కూడా చదవండి
  • ముందుగా ఖాతాదారులు ఎస్‌బీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.onlinesbi.com ను సందర్శించాలి.
  • అనంతరం మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌ను ఉపయోగించి నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత అందులో ‘ఈ-సర్వీసెస్’ అనే మెనూలోకి వెళ్ళండి.
  • అందులో ‘ట్రాన్స్ ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ(సేవింగ్స్ లేదా కర్రెంట్) ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోండి.
  • అనంతరం మీరు మీ ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్న బ్రాంచ్ కోడ్‌ను నమోదు చేయండి. ఒకవేళ మీకు బ్రాంచ్ కోడ్ తెలియకపోతే, ‘గెట్ బ్రాంచ్ కోడ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా బ్రాంచ్’ను ఎంచుకోండి.
  • అనంతరం కొత్త బ్రాంచ్ పేరుతో ఫారమ్‌ను నింపి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దానిని వెబ్‌సైట్‌లో  నమోదు చేయండి. దీంతో మీ అభ్యర్థన రిజిస్టర్ అవుతుంది.
  • మీ అభ్యర్ధనను బ్యాంకు పరిశీలించి, కొన్ని రోజుల్లోనే మీ ఖాతాను మరొక బ్రాంచ్‌కి బదిలీ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..