AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: కాపాడండయ్యా నన్ను..! ఒంటరి కుక్కను చుట్టుముట్టిన పిల్లుల గ్యాంగ్.. చివరకు ఏమయ్యిందంటే..?

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా సృష్టికి విరుద్ధంగా ఉంది. ఈ వీడియోలో ఓ కుక్కను ఏకంగా 5 పిల్లులు చుట్టుముట్టాయి. దాంతో ఎటువైపు..

Trending Video: కాపాడండయ్యా నన్ను..! ఒంటరి కుక్కను చుట్టుముట్టిన పిల్లుల గ్యాంగ్.. చివరకు ఏమయ్యిందంటే..?
Cats Vs Dog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 18, 2023 | 4:37 PM

Share

ఎక్కడైనా పిల్లులను కుక్కలే వేటాడతాయి. ఇంకా ఎలుకలను పిల్లులు, పిల్లులకు కుక్కలు వేటాడమే సృష్టిధర్మం కూడా కదా..! అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా సృష్టికి విరుద్ధంగా ఉంది. అవును, బట్ ఫర్ చేంజ్ అన్నట్లుగా.. ఈ వీడియోలో ఓ కుక్కను ఏకంగా 5 పిల్లులు చుట్టుముట్టాయి. దాంతో ఎటువైపు అడుగు వేయాలో తెలియని ఆ కుక్క తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక్కసారిగా అక్కడి నుంచి లఘించింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియలో తెగ చక్కర్లు కొడుతోంది.

అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే..? ఎవరూ లేని చోట ఒక కుక్కను చూసిన పిల్లులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి దాన్ని చుట్టుముట్టాయి. ఎంతలా అంటే అక్కడేదో పెద్ద ఫైట్ సీన్ జరుగుతుందేమో అన్నంత నిదానంగా ఆ కుక్కను చుట్టుముట్టాయి. మొత్తం 5 పిల్లులు తనను చుట్టుముట్టడంతో తప్పించుకోవడానికి దారేదిరా దేవుడా..? అనేలా బిత్తరచూపులు చూసిన ఆ కుక్క ఒక్కసారిగా అక్కడ నుంచి బయటపడి.. పక్కనే ఉన్న పొదలవైపుకు లగెత్తింది. అయితే అసలు అంత మాస్ సీన్ ఎందుకు క్రియేట్ అయ్యిందనే వివరాలు తెలియరాలేదు. కాగా,  ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు చేస్తూ నవ్వేసుకుంటున్నారు. పగడ్బందిగా కుక్కపై ప్లాన్ వేసిన క్యాట్స్ వీడియోను మీరూ ఓ సారి చూడండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన
ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన
తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే
తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే
రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..
రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..
ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..
ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!
దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త
దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త