Ola Offers: రూ. 61,999లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇంత భారీ డిస్కౌంట్ మళ్లీ రాదు.. వెంటనే బుక్ చేయండి..
కొత్త సంవత్సరాది సమీపిస్తోంది. చాలామంది ఉగాది నాడు ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు.ఒకవేళ మీరు అటువంటి ఆలోచనల్లోనే ఉంటే మీకో శుభవార్త. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.
కొత్త సంవత్సరాది సమీపిస్తోంది. చాలామంది ఉగాది నాడు ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ముఖ్యంగా కార్లు, బైక్లు వంటివి కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇటీవల కాలంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపే చూస్తున్నారు. ఒకవేళ మీరు అటువంటి ఆలోచనల్లోనే ఉంటే మీకో శుభవార్త. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. సగానికి పైగా తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటా ఆఫర్స్? ఏ కంపెనీ ఇస్తోంది ఆ ఆఫర్లు? చూద్దాం రండి..
ఓలా.. ఆఫర్ అదిరిపోలా..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా ఓ ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా స్కూటర్ల తయారీలో తన మార్క్ చూపించింది. మార్కెట్లో విద్యుత్ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లంటే ఓలా అనేలా బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంది. అటువంటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఒక్కో స్కూటర్ పై ఏకంగా రూ. 70 వేల వరకూ తగ్గింపును అందిస్తోంది. ఓలా ఎస్1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఉన్న ఈ ఆఫర్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఓలా ఎస్ 1ప్రో ఇలా..
ఓలా ఎస్ 1 ప్రో మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,39,999గా ఉంది. దీన్ని మీరు రూ. 69,999కే పొందొచ్చు. ఈ మోడల్‌పై ఏకంగా 4 ఆఫర్లు లభిస్తున్నాయి. అవేంటంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై నేరుగా రూ. 10 వేల తగ్గింపు ఉంది. అలాగే స్టూడెంట్, కార్పొరేట్ స్పెషల్ డిస్కౌంట్ రూ. 5 వేలు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ఏకంగా రూ. 45 వేల వరకు ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు లభిస్తుంది. ఇలా మీరు మొత్తంగా రూ. 69,999కే ఈ స్కూటర్ పొందొచ్చు.
ఓలా ఎస్1 స్కూటర్ పై ఆఫర్లు ఇలా..
ఓలా ఎస్1 మోడల్ విషయానికి వస్తే.. 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,09,999గా ఉంది. దీనిపై నేరుగా ఎలాంటి డిస్కౌంట్ లేదు. అలాగే స్టూడెంట్స్, కార్పొరేట్ స్పెషల్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది. అలాగే ఈ మోడల్‌పై గరిష్ట ఎక్స్చేంజ్ విలువ రూ. 45 వేలు పొందొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ లేదు. అంటే మీరు ఈ స్కూటర్‌ను రూ. 61,999కు కొనొచ్చు. కాగా ఈ ఆఫర్లు మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈఎంఐ ఆప్షన్లు కూడా..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆకర్షణీయ ఫైనాన్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఓలా ఎస్ 1 మోడల్‌పై నెలకు ఈఎంఐ రూ. 2,199 నుంచి ప్రారంభం అవుతోంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఉంటే.. అందులో ఫ్రంట్ ఫోర్క్ ఏమైనా సమస్య ఉంటే.. మీరు దగ్గరిలోని ఓలా సెంటర్‌కు వెళ్లి ఉచితంగానే దాన్ని రిప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..