Itel P40 : సూపర్ పవర్‌ఫుల్ బ్యాటరీతో ఐటెల్ నుంచి కొత్త ఫోన్.. స్టైలిష్ డిజైన్..కిర్రాక్ ఫీచర్స్..
ఐటెల్ కంపెనీ కొత్తగా పీ 40 పేరుతో మార్కెట్‌లో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇంత భారీ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఐటెల్ పీ 40 ధరను కంపెనీ అధికారికంగా రూ.7499గా నిర్ణయించింది.
భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వివిధ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కంపెనీలకు పోటీనిస్తూ తమ ఉత్పత్తులను రిలీజ్ చేస్తున్నాయి. ఐటెల్ కంపెనీ కొత్తగా పీ 40 పేరుతో మార్కెట్‌లో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇంత భారీ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఐటెల్ పీ 40 ధరను కంపెనీ అధికారికంగా రూ.7499గా నిర్ణయించింది. ఫోర్స్ బ్లాక్, డ్రీమీ బ్లూ, లగ్జరియస్ గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఐటెల్ ఇ-స్టోర్ నుంచి లేదా ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ ముఖ్యంగా సంవత్సరం పాటు వారంటీ ఇస్తుంది. అలాగే ఓ సారి ఫ్రీగా స్క్రీన్ రిప్లేస్‌మెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.
ఐటెల్ స్పెసిఫికేషన్లు ఇవే
- 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 612×720 రిజుల్యూషన్
- 9.2 ఎంఎం స్లిమ్ బాడీతో ఐపీఎస్ వాటర్ నాచ్ ప్యానెల్
- ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు
- 13 ఎంపీ క్యూవీజీఏ డ్యుయల్ కెమెరాతో పాటు డ్యుయల్ ఫ్లాష్
- 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- ఆక్టాకోర్ ఎస్‌సీ 9863ఏ చిప్ సెట్
- ఆండ్రాయిడ్ 12 గో సపోర్ట్
- 4 జీబీ + 64 జీబీ, 6 జీబీ + 32జీబీ, 7 జీబీ+64 జీబీ వేరియంట్ల్లో ఫోన్ లభ్యం
- 18 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..