Poco X5 Pro 5G.. ఇటీవల విడుదల చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 25,000లోపు బడ్జెట్ లో గేమ్ ఛేంజర్. దీనిలో పోకో తొలిసారి 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను అందించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్ ఉంది. దీనితో పాటు, ఫోన్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 120Hz హెచ్డీఆర్ 10 ప్లస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాక 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.