- Telugu News Photo Gallery Business photos Fixed Deposit Interest Rates 2023: these banks are offering higher return on fds can save tax also
FDపై ఎక్కువ వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారా..? ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే డబుల్ బెనిఫిట్స్..
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. చాలామంది పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. ఎక్కువ వడ్డీని పొందండంతోపాటు పన్ను ఆదా కోసం చూస్తున్నట్లయితే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచిదని పేర్కొంటున్నారు బ్యాంకు నిపుణులు.
Updated on: Mar 18, 2023 | 8:26 PM

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. చాలామంది పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. ఎక్కువ వడ్డీని పొందండంతోపాటు పన్ను ఆదా కోసం చూస్తున్నట్లయితే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచిదని పేర్కొంటున్నారు బ్యాంకు నిపుణులు. అలా పెట్టుబడి పెట్టి.. ఎక్కువగా ఆర్జించగల కొన్ని బ్యాంకులు కూడా ఉన్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పన్ను ఆదాతో పాటు రాబడుల ప్రయోజనాన్ని అందిస్తుంది. దీని కింద, మీరు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద మినహాయింపుతో క్లెయిమ్ చేయవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్ను ప్రయోజనం ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిలో ఇస్తారు. దీని కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాక్సిస్ బ్యాంక్ ఐదేళ్ల FDపై 7% వడ్డీ ఇస్తుంది. బంధన్ బ్యాంక్ 5.85%, బ్యాంక్ ఆఫ్ బరోడా FDపై 6.5% వరకు వడ్డీ చెల్లిస్తోంది. అదే సమయంలో, కెనరా బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్‌డిపై 6.5% వడ్డీని ఇస్తుంది.

Business idea

ఫెడరల్ బ్యాంక్ 6.6%, ICICI బ్యాంక్ 7% వడ్డీని అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీ ఇస్తుంది. స్టేట్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీ ఇస్తుంది.

మీరు కూడా ఎఫ్‌డీ కోసం వేచి చూస్తున్నట్లయితే.. ముందుగా బ్యాంకులకు వెళ్లి వడ్డీ వివరాలను తెలుసుకోండి.. ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి..





























