Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వృద్ధాప్యంలో కూడా చెరగిపోని అనుబంధం.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

నమ్మి వచ్చిన సహధర్మచారిణిని జాగ్రత్తగా.. కంటికి రెప్పలా కాపాడుకోవడం ఇలలో బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ సాథ్యమైనా కొన్నాళ్లకు అది సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. ఐతే ఈ వీడియోలో ఉన్న వృద్ధ దంపతులు మాత్రం ఈ కోవకు చెందిన వారు కాదు..

Viral Video: వృద్ధాప్యంలో కూడా చెరగిపోని అనుబంధం.. నెట్టింట వైరలవుతోన్న వీడియో
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 19, 2023 | 5:48 PM

ప్రేమంటే వ్యామోహం, ఒకరిపై ఒకరికి ఉండే ఆకర్షణ కానేకాదు. ప్రేమ సహిస్తుంది, దయ చూపిస్తుంది. ఉప్పొంగదు.. అమర్యాదగా నడుచుకోదు. స్వప్రయోజనం కోసం తహతహలాడదు. అలాంటి ప్రేమను పెళ్లిబంధంతో గెలిపించుకోవడం ఒక ఎత్తైతే.. ఆజన్మాంతం ఆ ప్రేమకు కలంకంరాకుండా దానిని నిలుపుకోవడం మరో ఎత్తు. ఫోన్లలో గంటల కొద్దీ మాట్లాడటం, అందమైన ప్రేమలేఖలు పంపడం నిజమైన ప్రేమనిపించుకోదు. నమ్మి వచ్చిన సహధర్మచారిణిని జాగ్రత్తగా.. కంటికి రెప్పలా కాపాడుకోవడం ఇలలో బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ సాథ్యమైనా కొన్నాళ్లకు అది సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. ఐతే ఈ వీడియోలో ఉన్న వృద్ధ దంపతులు మాత్రం ఈ కోవకు చెందిన వారు కాదు. అంత గొప్పపని ఏం చేశారా? అని ఆలోచిస్తున్నారా? మీరే చూడండి..

అస్సాంలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఇద్దరు వృద్ధ దంపతులు నడుచుకుంటూ రావడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇంతలో వాహనాలు వెళ్లే వైపు భార్య నడుస్తుంటే.. ఆమెను తనకు అవతల వైపుకులాగి తాను రోడ్డువైపు నడుస్తాడు. పైగా ఆమె చెయ్యి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తుంటాడు భర్త. భార్యకు ఏ ప్రమాదం జరగకుండా సేఫ్ సైడ్‌కి లాగి ఒకరికొకరు చేతులు పట్టుకుని తోడుగా నడుస్తున్న విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను జెనిఫర్ రెహమాన్ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. లక్షల్లో వీక్షణలు, లైకులు, కామెంట్లు రావడంతో ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ట్రూలవ్‌ అండ్‌ కేరింగ్‌, బెస్ట్‌ లవ్‌ అంటూ పలువురు కామెంట్‌ సెక్షన్‌లో తమ స్పందనను తెల్పుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.