Power Consumption: దేశంలో పెరిగిన విద్యుత్‌ వినియోగం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..

దేశంలో విద్యుత్‌ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 శాతం పెరిగి 1375.57 బిలియన్ యూనిట్లకు..

Power Consumption: దేశంలో పెరిగిన విద్యుత్‌ వినియోగం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..
India's Power Consumption
Follow us

|

Updated on: Mar 19, 2023 | 6:29 PM

దేశంలో విద్యుత్‌ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 శాతం పెరిగి 1375.57 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2021-22లో దేశ వ్యాప్తంగా 1245.54 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాం. ఏప్రిల్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు వినియోగించిన విద్యుత్‌లో 10 శాతం అధికంగా వినయోగించడం జరిగింది. ఇక ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్ వినియోగం రెండంకెలకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలో గరిష్టంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్స్‌ ఉండే అవకాశం ఉంది. గతేడాది ఇదే నెలలో నమోదైన 215.88 గిగావాట్స్‌ను అధిగమించనుంది.

దీంతో పెరగనున్న విద్యుత్ వినియోగం దృష్ట్యా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పలు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ కోతలు, లోడ్ షెడ్డింగ్‌ వంటివి చేయొద్దంటూ రాష్ట్రాలకు సూచించింది. దిగుమతి చేసుకున్న అన్ని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మార్చి 16 నుంచి జూన్ 15 వరకు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని రాష్ట్రాలను కోరింది. రానున్న రోజుల్లో పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల కారణంగా వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏప్రిల్‌ నెల నుంచి పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ తీర్చడం రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి