Ram Gopal Varma: ‘సూపర్‌ థ్రిల్లింగ్‌గా ఉంది.. 37 ఏళ్ల తర్వాత నా బీటెక్‌ డిగ్రీ తీసుకున్నా.. కానీ ఆసక్తి లేదు’

తెలుగు సినీ వినీలాకాశంలో అసమాన చిత్రాలను తీసి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. లోతైన ఆలోచన దృక్పథం, తెలుగు-ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని అవసోసన పట్టిన మేథావి అయిన ఆర్జీవీ తాజాగా నాగార్జున యూనివర్సిటీలో..

Ram Gopal Varma: 'సూపర్‌ థ్రిల్లింగ్‌గా ఉంది.. 37 ఏళ్ల తర్వాత నా బీటెక్‌ డిగ్రీ తీసుకున్నా.. కానీ ఆసక్తి లేదు'
Ram Gopal Varma
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 19, 2023 | 2:06 PM

తెలుగు సినీ వినీలాకాశంలో అసమాన చిత్రాలను తీసి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. లోతైన ఆలోచన దృక్పథం, తెలుగు-ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని అవపోసన పట్టిన మేథావి అయిన ఆర్జీవీ తాజాగా నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు కంపరం పుట్టిస్తున్నాయి. తిని, తాగి ఎంజాయ్ చేయండి.. స్వర్గంలో రంభ ఊర్వశి ఉంటారో లేదో తెలియదు.. ఇక్కడే ఎంజాయ్ చేయండి.. ప్రపంచంలో మగాళ్లందరూ చచ్చిపోయి నేనొక్కడినే మిగలాలని కోరుకుంటున్నాను.. అప్పుడు ఆడజాతికి నేనే దిక్కవుతా లాంటి మాటలు రాంగోపాల్ వర్మ నోట రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని బతికేవాడు చచ్చిపోయినట్టేననే మాటలు విద్యార్ధులతో చెప్పవచ్చా లేదా అనే కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడారంటూ సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

నిజానికి ఆర్జీవీ కూడా ఏఎన్‌యూ విద్యార్ధే. ఆ విషయాన్ని రాం గోపాల్‌ వర్మ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. రామ్ గోపాల్ వర్మ విజయవాడలోని విఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 1985లో బీటెక్ పూర్తి చేశాడు. సెకండ్ క్లాస్‌లో పాసైనప్పటికీ అప్పటి నుంచి ఆ డిగ్రీ పట్టాని అందుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్‌ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన ఆర్జీవీ బీటెక్ డిగ్రీ పట్టాని అందుకున్నాడు. 37 ఏళ్ల తర్వాత పట్టా అందుకోవడం థ్రిల్‌గా ఉందంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. తనకు నాగార్జున వర్సిటీ అధికారులు డిగ్రీ పట్టా ఇస్తున్న ఫొటోను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘బీటెక్ పాస్ అయిన 37 ఏళ్ళ తరువాత నా డిగ్రీ పట్టాని అందుకోవడం సూపర్ థ్రిల్‌గా ఉంది. సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయాలనే ఆసక్తి నాకు లేదు. అందుకే 1985 నుంచి నా డిగ్రీ పట్టాని తీసుకోలేదు. థ్యాంక్యూ..’ అంటూ రాసుకొచ్చాడు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వెరల్‌ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా తొలుత వైరల్‌ అయ్యి.. ఆ తర్వాత కాంట్రవర్సీ అవుతుంది. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఆర్జీవీ వ్యాఖ్యలు అలాంటి దుమారాన్నే లేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.