Watch Video: యువతిపై పిడిగుద్దులు.. దేశ రాజధానిలో మరో షాకింగ్ సీన్
ఒక వ్యక్తి మహిళను ఈడ్చుకొచ్చి, కొట్టి క్యాబ్‌లోకి నెట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకంది . స్థానికులు తమ మొబైల్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఒక వ్యక్తి మహిళను ఈడ్చుకొచ్చి, కొట్టి క్యాబ్‌లోకి నెట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకంది . స్థానికులు తమ మొబైల్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి మంగోల్‌పురి ఫ్లై ఓవర్ వద్ద మహిళను ఒక వ్యక్తి ఈడ్చుకొచ్చాడు. ఆమెను బలవంతంగా ప్రైవేట్ క్యాబ్‌లోకి తోసి పిడిగుద్దులు కురిపించాడు. మరో వ్యక్తి కూడా ఆ కారు వద్ద ఉన్నాడు. అనంతరం వారు అక్కడి నుంచి ఆ కారులో వెళ్లిపోయారు.ఈ వీడియో క్లిప్ ను నెటీజన్లు ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేయగా వారు అప్రమత్తమయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న ఆ ప్రైవేట్ క్యాబ్ హర్యానాలోని గురుగ్రామ్‌లో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. ఆ కారు డ్రైవర్‌ను గుర్తించి అతడి నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి రోహిణి నుంచి వికాస్‌పురి ప్రాంతానికి ఉబర్ ద్వారా క్యాబ్ బుక్ చేసినట్లు తెలుసుకున్నారు. మార్గమధ్యలో అమ్మాయి, అబ్బాయిల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగిందని డీసీపీ హరేందర్ కుమార్ సింగ్ తెలిపారు. దీంతో ఆ మహిళ కారు దిగడంతో వెంటనే వారితో పాటు ఉన్న వ్యక్తి బలవంతంగా ఆమెను కారులోకి తోసి కొట్టినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ తమ దృష్టికి వచ్చిందని, దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. ఆ మహిళ, ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.




#SOS | Just Now at Mangolpuri Flyover towards Peeragarhi Chowk.@DelhiPolice @LtGovDelhi @dcpouter @DCWDelhi @dtptraffic pic.twitter.com/ukmVc7Tu1v
— Office of Vishnu Joshi (@thevishnujoshi) March 18, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి