Kids Health: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త పడాల్సిందే.. కారణమేమంటే..?

గతంలో ఓ నిర్ణీత వయసు దాటిన తర్వాతే డయాబెటీస్, బీపీ, గుండెపోటు వంటి పలు ఆరోగ్య సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పటికాలంలో..

Kids Health: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త పడాల్సిందే.. కారణమేమంటే..?
Diabetes In Kids
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 19, 2023 | 7:38 PM

ప్రస్తుత కాలంలో మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే పిల్లలు ఈ సమస్యల బారిన వేగంగా పడుతుంటారు. గతంలో ఓ నిర్ణీత వయసు దాటిన తర్వాతే డయాబెటీస్, బీపీ, గుండెపోటు వంటి పలు ఆరోగ్య సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పటికాలంలో చిన్నపిల్లల ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధులు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి బారిన పడే పిల్లల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లలలో షుగర్ వ్యాధి కలగడానికి నిర్దిష్టమైన కారణమంటూ ఏమీ లేదు. జీవనశైలి, తినే ఆహారం, జన్యుపరమైన కారణాలు పిల్లలలో షుగర్ వ్యాధి రావడానికి కారణం కావచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది పిల్లలు, యుక్తవయస్కులు టైప్ -1 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తికి ఇబ్బంది ఏర్పడుతోందిని అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది.

మధుమేహం రకాలు: మధుమేహంలో టైప్ 1 , టైప్  2  అని రెండు రకాలున్నాయి. వీటిలో టైప్ 1  ప్రమాదకరంగా  పరిగణించబడుతుంది. టైప్ 1 డయాబెటిస్ బాధితులు పలు సందర్భాల్లో ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ తీసుకోవడం ఆపేస్తే.. ఆ వ్యక్తి త్వరగా మరణించే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో చిన్న పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెంటనే వాటిని గుర్తించి, సరైన చికిత్స అందించకపోతే పిల్లల  ప్రాణానికి హానికరం. మరి టైప్ 1 డయాబెటీస్ లక్షణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు:

1. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు టైప్-1 మధుమేహంతో బాధపడుతుంటే.. దీని ప్రభావం వారి శారీరక బరువుపై చూపిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల బరువు వేగంగా తగ్గుతారు. ఈ ఇటువంటి పరిస్థితి పిల్లలో కనిపిస్తే.. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమవ్వాలి. వైద్యుడికి చూపించాలి.

ఇవి కూడా చదవండి

2. టైప్-1 మధుమేహం ఉన్న రోగులు ఎక్కువ ఆకలితో ఉంటారు. నిపుణుల ప్రకారం..  శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల కారణంగా, ఆకలి పెరగడం ప్రారంభమవుతుంది. రెండు రకాల మధుమేహంలోనూ ఈ లక్షణాలు కనిపిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్న తర్వాత జీర్ణం కావడానికి శరీరంలోని శక్తి వృథా అవుతుంది. అటువంటి పరిస్థితిలో.. పిల్లల్లో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

3. పిల్లలు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతుంటే.. త్వరగా అలసిపోతారు. ఆహారం జీర్ణం కావడం నుంచి అనేక ఇతర సమస్యలతో ఇబ్బంది పడతారు.

4. టైప్-1 మధుమేహం ఉన్న రోగులు టైప్-2 మధుమేహం ఉన్న రోగికిలా అధికంగా దాహం వేస్తుంది.   అయితే ఇలా ఆర్థికంగా నీరు తాగడం.. ప్రతి ఆరోగ్య సమస్యలో సర్వరోగ నివారిణి పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ఈ టైప్-1 మధుమేహం రోగులకు మాత్రం హానిని కలిగిస్తుంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన సమస్య మొదలవుతుంది.

నివారణ: కోరినది తినాలనుకునే మీ పిల్లలు టైప్-1 మధుమేహం వంటి వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంచాలనుకుంటే.. ప్రతిరోజూ ఆకుపచ్చ కూరగాయలు, తక్కువ తీపి పండ్లను తినేలా చేయండి. అంతేకాదు పిల్లలు శారీరక శ్రమ చేసేలా రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలను రోజూ చేసేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..