AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Budh Gochar 2023: మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులకు ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక రాబడి..

సఖల ఐశ్వర్యాలను ప్రసాధించే శుక్రుడు, సంపదను ఇచ్చే బుధుడు మేషరాశిలో సంయోగం చెందడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో

Shukra Budh Gochar 2023: మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులకు ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక రాబడి..
Lakshminarayana Rajayog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 19, 2023 | 5:22 PM

Share

జ్యోతిష్య శాస్త్రానికి అన్ని సంస్కృతలలోనూ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వైదిక సంస్కృతితో పాటు గ్రీకు, తావో నాగరికతలలో కూడా ఇది ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులను బట్టి ఫలానా రాశిచక్రానికి ఫలానా సమయంలో మంచిచెడులు జరుగుతాయని తెలుసుకోవచ్చు. ఇంకా జ్యోతిష్యంలో గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే మార్చి నెల చివరి రోజుల్లో బుధ-శుక్రుల సంయోగం మేషరాశిలో జరగనుంది. ఇటీవలే అంటే హోళీ తర్వాత శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అలాగే ఈ నెల చివరిలో అంటే మార్చి 31న బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా సఖల ఐశ్వర్యాలను ప్రసాధించే శుక్రుడు, సంపదను ఇచ్చే బుధుడు మేషరాశిలో సంయోగం చెందడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో పరమపవిత్రమైనదిగా భావిస్తారు జ్యోతిష్య నిపుణులు. ఇక లక్ష్మీనారాయణ రాజయోగం ముఖ్యంగా రాశిచక్రంలోని మూడు రాశులవారిపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. మరి ఈ అదృష్ట రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కర్కాటక రాశి: లక్ష్మీనారాయణ రాజయోగం కర్కాటక రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు ఏ పని చేపట్టినా దానిని సకాలంలో పూర్తిచేయడంతో పాటు లాభాలు గడిస్తారు. వ్యాపారం కూడా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికంగా చాలా ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం కలిసి రావడమే కాక ప్రయోషన్ కూడా వస్తుంది.

మిథున రాశి: శుక్రుడు-బుధుడు కలయిక వల్ల మిథునరాశి వారి ఆదాయం రెట్టింపు వేగంతో పెరుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో ప్రమోషన్ లభిస్తుంది. పెట్టుబడికి ఇది అత్యంత అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి. ఈ సమయంలో మిథునరాశివారి బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ఆర్థిక లాభాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. విదేశాలలో చదువుకోవాలనేవారి కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మరింతగా బలపడుతుంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?