Ugadi Horoscope: ఉగాది తర్వాత ఈ రాశులవారికి అన్నీ లాభాలే..! ఎంతగా అంటే మండే సూర్యుడిలా వెలిగిపోతుంది..!

జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల కదలిక రాశిచక్రంలోని 3 రాశులకు అత్యంత శుభసూచకం, శోభాయమానంగా ఉండబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మండే సూర్యుడిలా..

Ugadi Horoscope: ఉగాది తర్వాత ఈ రాశులవారికి అన్నీ లాభాలే..! ఎంతగా అంటే మండే సూర్యుడిలా వెలిగిపోతుంది..!
Ugadi Horoscope
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 19, 2023 | 4:00 PM

సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేవారికి తమ నూతన సంవత్సరాన్ని చైత్రమాసం శుక్లపక్షం ప్రతిపద తిధి నుంచి అనుసరిస్తారు. ఇక ఈ సారి చైత్ర శుక్లం మార్చ్ 22వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇంకా ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రి కూడా. దాంతో పాటే హిందూ క్యాలెండర్‌లో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఇక ఈ ఏడాదిని విక్రమ నామ సంవత్సరంగా పిలుస్తారు. సనాతన హిందూ ధర్మంలో ఈ విక్రాంత నామ సంవత్సరం 2080వ ఏడాది. అయితే ఈ క్రమంలోనే జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం కొన్ని గ్రహాల కదలిక రాశిచక్రంలోని 3 రాశులకు అత్యంత శుభసూచకం, శోభాయమానంగా ఉండబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మండే సూర్యుడిలా వీరి జాతకం మెరిసిపోతుంది. ఇక హిందూ క్యాలెండర్ కొత్త ఏడాది జ్యోతిష్యం ప్రకారం విక్రాంత నామ సంవత్సరం 2080లో గ్రహాల రాజకుమారుడైన బుధుడు రాజుగా, శుక్రుడు మంత్రిగా ఉంటారు. దీని ప్రభావం మొత్తం అన్ని రాశుల జీవితాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

తులా రాశి: జ్యోతిష్యం ప్రకారం తులా రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. వృత్తి జీవితంలో ప్రత్యర్ధులు మీ ముందు నిలవలేరు. విద్యారంగంలో విజయం, ఉన్నతి రెండూ ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు అన్నీ సమూలంగా తొలగిపోతాయి.

సింహ రాశి: హిందూ క్యాలెండర్‌లోని విక్రాంత నామ సంవత్సర ప్రారంభం చైత్ర మాసం శుక్లపక్షంతో ఉంటుంది. ఈ క్రమంలో సింహరాశి జాతకులకు అద్భుతమైన లాభాలుంటాయి. ఎలా అంటే.. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగం విషయంలో ఉన్న సమస్యలు, కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: మార్చ్ 22వ నుంచి ప్రారంభం కానున్న ఈ కొత్త విక్రాంత నామ సంవత్సర ప్రభావం మిథున రాశి జాతకులపై ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో మంచి రోజులు వచ్చినట్టే. ఈ సందర్భంగా వీరికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడమే కాక ఆర్ధికంగా కూడా లాభాలుంటాయి. అన్నింటికీ మించి.. అదృష్ట దేవత అయిన శ్రీమహాలక్ష్మీ ఈ రాశివారికి తోడుగా ఉంటుంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..