Watch: మాములు ప్లాన్ కాదుగా..! గోడ చాటున మాటేసి కోడిని దొంగిలించిన కుక్క.. వైరల్ అవతున్న వీడియో..

ఆదివారం వచ్చిందంటే చాలు, చాలా మందికి చికెన్ ముక్క లేకపోతే ముద్ద దిగదు. మరి పెంపుడు కుక్కల పరిస్థితి ఏంటి..? వాటికి ఆదివారం అంటూ..

Watch: మాములు ప్లాన్ కాదుగా..! గోడ చాటున మాటేసి కోడిని దొంగిలించిన కుక్క.. వైరల్ అవతున్న వీడియో..
Dog Stealing Chicken
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 19, 2023 | 6:56 PM

మనలో చాలా మంది చికెన్ కర్రీని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు, చికెన్ ముక్క లేకపోతే ముద్ద దిగదు. మరి పెంపుడు కుక్కల పరిస్థితి ఏంటి..? వాటికి ఆదివారం అంటూ ప్రత్యేకవారం లేదుగా.. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చికెన్ కర్రీ. తెచ్చేదాకా ఆగవు, ఆగినా అలక మానవు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్న కుక్క అలా చేయలేదు. ఎవరినో అడగటం ఎందుకు..? నేనే చికెన్‌ని పట్టి తెచ్చుకుంటా అని దొంగ కోళ్ల కోసం ప్రయత్నం చేసి విజయం సాధించింది. ఇందుకోసం చాటున మాటేసి మరి ఓ కోడిని దొంగిలించి పట్టేసింది ఆ పెంపుడు కుక్క. ఇక దీనంతటకి సంబంధించిన వీడియోను దాని యజమాని షూట్ చేశాడు. అది కాస్త నెట్టింటకు చేరడంతో నెటిజన్ల కంట పడి తెగ వైరల్ అవుతుంది.

అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే..? తెలివిగా కోళ్లను పట్టడం కోసం ఒక కుక్క.. అవి వచ్చి తిరిగే చోట ఓ సంచి వేసి అందులో మొక్కజోన్న గింజలను వేసింది. ఆపై అక్కడే ఉన్న గోడ చాటుకు వెళ్లి.. ఏదైనా కోడి వచ్చి తినకపోతుందా..? అని ఎదురుచూడసాగింది. ఆఖరికి కొన్ని కోళ్లు వచ్చి గింజలను తినడం ప్రారంభించాయి. ఇక పని సుఖాంతం అనుకున్న ఆ పెంపుడు కుక్క ముందుకు వచ్చి..ఆ సంచిలో ఒక కోడి మాత్రమే ఉందని తెలిసినా, అదే చాలనుకుని అక్కడి నుంచి సంచిని నోట బెట్టుకుని అక్కడనుంచి వెళ్లిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో adore_pankaj అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయింది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, Dog : I will eat chicken today.? అనే క్యాప్షన్‌తో నెటిజన్ల ఎదుట ప్రత్యక్షమైన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 22 వేల లైకులు, 23 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లతో తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇంకా ఇదే క్రమంలో ఓ నెటిజన్ ‘నేను ఆ బంగారాన్ని(పెంపుడు కుక్క) దత్తత తీసుకుంటాను’ అని రాసుకొచ్చారు. తక్కిన వారంతా రకరకాల ఎమోజీలతో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..