TSPSC: కొన్ని శక్తులు రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నాయి.. ప్రశ్నాపత్రాల లీక్‌లపై బీఆర్‌ఎస్‌ నేతల రివర్స్‌ అటాక్‌.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారం రాష్ట్రంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజశేఖర్ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓవైపు సిట్‌ దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు..

TSPSC: కొన్ని శక్తులు రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నాయి.. ప్రశ్నాపత్రాల లీక్‌లపై బీఆర్‌ఎస్‌ నేతల రివర్స్‌ అటాక్‌.
Brs On Tspsc
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2023 | 2:10 PM

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారం రాష్ట్రంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజశేఖర్ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓవైపు సిట్‌ దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు రాజకీయంగానూ పేపర్ లీకేజ్‌ విషయం కేంద్ర బిందువైంది. బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ నేతలు అన్నట్లు పరిస్థితి మారింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతోన్న వేళ.. బీఆర్‌ఎస్‌ నాయకులు తాజాగా రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు.

రాజ్యాంగబద్ధమైన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురించి అవగాహన లేకుండా కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. పరీక్ష రాసిన ప్రతీ ఒక్కరిని అనుమానించేలా వాళ్ల మాటలున్నాయని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. పరీక్ష రాసిన వాళ్లు అధైర్యపడొద్దని ఆయన సూచించారు. చదువురాని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తే ఒక అర్థముందని, కానీ విద్యావంతుడైన RS ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు సీఎం కార్యాలయంగాని, మంత్రులుగాని ఆయన విధుల్లో జోక్యం చేసుకున్నారా అని ప్రశ్నించారు.

పరీక్షల్లో లీకేజిని చూపుతూ కొన్ని శక్తులు రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానందా ఆరోపించారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీఎంను, ఐటీ మంత్రిని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపైన న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వివేకానందా హెచ్చరించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి మాటలు పూర్తి బాధ్యతారహిత్యంతో కూడుకున్నవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. గోబెల్స్‌ వారసులుగా వాళ్ల మాటలున్నాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..