Agnipath Protest: రైళ్ల పునరుద్ధరణపై ఇప్పుడే ఏం చెప్పలేం.. రిజర్వేషన్లు చేసుకున్న వారికి అమౌంట్‌ రీఫండ్‌: సీపీఆర్వో..

Agnipath Protest News: సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ (Agnipath Scheeme)పై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లమీదకు వస్తున్నారు.

Agnipath Protest: రైళ్ల పునరుద్ధరణపై ఇప్పుడే ఏం చెప్పలేం.. రిజర్వేషన్లు చేసుకున్న వారికి అమౌంట్‌ రీఫండ్‌: సీపీఆర్వో..
Agnipath Protests
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 3:54 PM

Agnipath Protest News: సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ (Agnipath Scheeme)పై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లమీదకు వస్తున్నారు. పలుచోట్ల రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రైల్వేబోగీలు, రైలు పట్టాలు, ఫర్నీచర్స్‌ను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడీ ఆందోళనలు తెలుగు రాష్ట్రాలకు కూడా తాకాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌ (Secunderabad) రైల్వేస్టేషన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా మెట్రో రైళ్లు, ఎంఎంటీస్‌ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఈక్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో చెల‌రేగిన‌ ఆందోళ‌న‌లతో క‌ల‌క‌లం చెల‌రేగ‌డంపై రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పందించారు. రైళ్ల పునరుద్ధరణపై ఆయ‌న‌ టీవీ9 తో మాట్లాడారు..

వారికి ఆమౌంట్ తిరిగి చెల్లిస్తాం..

‘సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లు, విధ్వంసంపై ఎమర్జెన్సీ కంట్రోల్‌ యాక్షన్‌ ప్లాన్‌ మొఆదలైంది. స్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. స్టేషన్‌లోకి ఆందోళన కారులు ఎలా వచ్చారు? అనేదానిపై దర్యాప్తు సాగుతోంది. వైఫల్యం ఎక్కడ జరిగిందో ఆరా తీస్తున్నాం. దీనికి కారకులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం. స్టేషన్‌లో ఎన్నిగంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పటివరకు మొత్తం77 రైళ్లు రద్దు చేశాం. 6 ఎక్స్ ప్రెస్ రైళ్లు , 55 ఎంఎంటీస్‌ రైళ్లు పూర్తిగా రద్దు కాగా, 6 రైళ్లు పాక్షికంగా రద్దు. ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్న వారికి తిరిగి అమౌంట్‌ చెల్లిస్తాం. ఇక మధ్యలో నిలిచిపోయిన రైళ్ల ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రాకేశ్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles