Agnipath Protest: ముందస్తు ప్లాన్‌తోనే ఈ నిరసనలు.. రాత్రి నుంచే స్టేషన్‌లో ఉన్నాము: ఆర్మీ అభ్యర్థులు
Agnipath Protest: అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇక సికింద్రాబాద్..
Agnipath Protest: అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోనూ విద్యార్థులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పటించి నిరసన తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇక అగ్నిపథ్ స్కీమ్‌ను ఎత్తివేయాలని ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు ముందస్తు ప్లాన్ వేసినట్లు ఆర్మీ అభ్యర్థులు తెలిపారు. నిరసన తెలిపేందుకు రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాము.. రాత్రి నుంచే రైల్వేస్టేషన్‌లోనే ఉన్నాము. వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసుకుని సమాచారం చేరవేసుకున్నామని ఆర్మీ అభ్యర్థులు Tv9తో తెలిపారు.
నిరసనలు తెలియజేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాము. కాల్పుల్లో మృతి చెందిన వారికి న్యాయం జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు ప్లాన్‌తోనే రైల్వేస్టేషన్‌లో ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు. పోలీసులు కాల్పలు జరిపినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి