Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో.. నాంపల్లి స్టేషన్ మూసివేత.. 71 రైళ్లు రద్దు

Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మూడు రైళ్లకు నిప్పటించారు ఆందోళనకారులు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి..

Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో.. నాంపల్లి స్టేషన్ మూసివేత.. 71 రైళ్లు రద్దు
Agnipath Protest
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 3:51 PM

Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మూడు రైళ్లకు నిప్పటించారు ఆందోళనకారులు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనకారుల దాడులలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. రైలు పట్టాలపై పార్శిళ్లు, ఫర్నిచర్స్‌, రైలు బోగీలను ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు. ఇక ఆందోళనల నేపథ్యంలో వరంగల్‌, కాజీపేట రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అప్రమత్తం అయ్యారు పోలీసులు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా భారీగా మోహరించిన పోలీసులు. కాజీపేట, వరంగల్‌ స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు రైల్వే అధికారులు.

సికింద్రాబాద్‌ అల్లర్లలో మృతి చెందిన విద్యార్థి దామోదర్

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి దామోదర్‌ కురేషిగా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి కుమారస్వామి. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు వెళ్లి అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

నాంపల్లి రైల్వేస్టేషన్‌ మూసివేత

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను మూసివేశారు పోలీసులు. ప్రయాణికులు లోపలికి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు నాంపల్లి పోలీసుస్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచారు.

మొత్తం 71 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో మొత్తం 71 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. అల్లర్లు సద్దుమణిగిన తర్వాత పునరుద్దరిస్తామని చెబుతున్నారు పోలీసులు. ఆరు రైళ్లను అధికారికంగా రద్దు చేశారు రైల్వేఅధికారులు. రద్దు అయిన రైళ్లు.. ఈస్ట్ కోస్ట్, షాలిమార్, హుందానగర్, వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి రైళ్లు. సికింద్రాబాద్ ఔటర్‌లో రైళ్లు నిలిచిపోయాయి. మౌలాలి, చర్లపల్లి, ఘట్ కేసర్ స్టేషన్లులో రైళ్లు నిలిచిపోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!