AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనల నేపథ్యంలో మెట్రో ట్రైన్స్ రద్దు.. ఎప్పటివరకు అంటే..?

అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో యువకులు చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది.

Hyderabad: అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనల నేపథ్యంలో  మెట్రో ట్రైన్స్ రద్దు.. ఎప్పటివరకు అంటే..?
Hyderabad Metro
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 17, 2022 | 3:54 PM

Share

Agnipath Protests:  అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి . ఈ అగ్గి జ్వాలలు తెలంగాణ(Telangana)కు చేరుకున్నాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌(Secunderabad)లో యువకులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు చేస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. అన్ని మార్గాల్లో ట్రైన్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.  ఈ క్రమంలోనే పలు రైళ్లతో పాటు MMTS ట్రైన్ కూడా రద్దయ్యాయి.  ఫలక్‌నుమా నుంచి లింగపల్లి వెళ్లే 12ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు రదయ్యాయి. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 13 ఎంఎంటీఎస్‌ ట్రైన్స్ నిలిచిపోయాయి. దీనివల్ల ఇవాళ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్