AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SLBC Tunnel: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌.. పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా..

SLBC టన్నెల్లో పైకప్పు కూలిన ప్రమాదం జరిగి ఇవాళ్టికి మూడోరోజు. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడమే ఇప్పుడు టాప్‌ ప్రియారిటీ. కానీ రెస్క్యూ ఆపరేషన్‌కు రకరకాల ఛాలెంజ్‌లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించుకుంటూ నిపుణులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్‌ చూస్తున్నాం..

SLBC Tunnel: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌.. పరిస్థితిపై  సీఎం రేవంత్ ఆరా..
Slc Tunnel
Ravi Kiran
|

Updated on: Feb 24, 2025 | 12:20 PM

Share

SLBC టన్నెల్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి దేశమంతా చర్చించుకుంటోంది. అయితే, ఇంతటి భారీ టన్నెల్‌ను తవ్వే టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ ఎలా ఉంటుంది? టన్నెల్‌ కోసమే తయారుచేసిన ఈ మెషీన్‌ స్వరూపం ఎలా ఉంటుంది? ఇప్పుఉ ఇవే అంశాలు కీలకం. టన్నెల్‌లో జరిగిన ప్రమాదానికి ఆ బోరింగ్ మెషీన్‌ కూడా దెబ్బతిన్నదని అంటున్నారు. అసలు టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ ఎలా ఉంటుందో చూద్దాం..

శ్రీశైలం కొండను తవ్వుతున్న బోరింగ్‌ మెషీన్‌ అటూఇటూగా ఇలాగే ఉంటుంది. SLBC భూగర్భాన్ని తొలిచేస్తూ, టన్నెల్‌ను నిర్మించడంలో బాహుబలి వంటి ఈ బోరింగ్‌ మెషీనే కీలకం. శ్రీశైలం దగ్గర దోమలపెంటలో ఉన్న SLBC టన్నెల్‌ నిర్మాణానికి వాడుతున్న అర్థచంద్రాకారంలో ఉన్న సిమెంట్‌ దిమ్మెలు ఇవే. వీటిని ఉపయోగించి సొరంగాన్ని వృత్తాకారంగా ఇలా పకడ్బందీగా నిర్మిస్తున్నారు. 10 మీటర్ల వ్యాసంతో ఉన్న టన్నెల్‌ నిర్మించాలంటే, ఈ కొండల్లోని శిలలను తవ్వాలి. ఇది మనుషులు చేసే పనికాదు. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వాలి. అయితే ఇవి మార్కెట్లలో లభించేవి కావు. తవ్వాల్సిన టన్నెల్‌ కోసం, అక్కడి భూమి, శిలలు వంటి భౌగోళిక స్వరూపానికి తగ్గట్లుగా టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ను ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది.

బోరింగ్‌ మెషీన్‌ ఇలా భారీ పైప్‌లా ఉంటుంది. ఇది కొండను తొలుస్తుంది. అతి భారీ నిర్మాణంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బోరింగ్‌ మెషీన్‌ ముందున్న బ్లేడ్స్‌- బండరాళ్లు, మట్టిన తొలుచుకుంటూ ముందుకు వెళుతుంది. ప్రస్తుతం SLBC ఇన్‌లెట్‌ పాయింట్‌ నుంచి 14 కిలోమీటర్ల వరకు ఇలాంటి యంత్రమే తవ్వింది. ఈ బోరింగ్‌ మెషీన్‌ కొండను తొలుస్తున్న సమయంలో వచ్చే మట్టిపెళ్లలు, బండరాళ్లను ఇలాంటి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటకు తరలిస్తారు. మట్టిని బయటకు పంపించిన తర్వాత, టన్నెల్‌ని నిర్మించడానికి ప్రత్యేకంగా సిమెంట్ బ్లాక్స్‌ను తయారుచేస్తారు. ఆ సిమెంట్‌ బ్లాక్స్‌ను ఇలా టన్నెల్‌కు కవచంగా ఫిట్‌ చేస్తారు. తద్వారా భూ ఉపరితలం నుంచి వచ్చే ఒత్తిడిని ఈ సిమెంట్‌ బ్లాక్స్‌ తట్టుకునేలా నిర్మాణం సాగుతుంది. అలాగే భూమి పొరల నుంచి లీక్‌ అయ్యే నీటిని ఇవి అరికడతాయి. నీటి ఊట వల్ల ఈ సొరంగం దెబ్బతినకుండా ఈ సిమెంట్‌ బ్లాక్స్‌ రక్షణ కవచంగా నిలుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ పనులు జరిగే సమయంలో ఆక్సిజన్‌ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక పైప్‌ ద్వారా ఫోర్స్‌గా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తారు. అదేసమయంలో లోపల ఉన్న గాలిని బయటకు పంపడానికి ప్రత్యేకంగా ఎగ్జాస్ట్‌ పైపులను అమరుస్తారు. టన్నెల్‌ నిర్మాణ పనులు జరగడానికి విద్యుత్‌ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారు.. ఇప్పుడు ఇవన్నీ SLBC టన్నెల్‌లో ఉన్నాయి. అయితే 13.5 కిలోమీటర్ల తర్వాత సొరంగం పైకప్పు కూలడంతో, పైప్‌ లైన్లు దెబ్బతిన్నాయి. వీరికి మరమ్మతులు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం శ్రీశైలం దగ్గర SLBC టన్నెల్‌ను ఈ భారీ బోరింగ్ యంత్రం తవ్వుతోంది. అయితే నీటి లీకేజీల వల్ల- ఇప్పుడు ఈ బోరింగ్‌ యంత్రం దెబ్బతిన్నదని చెబుతున్నారు. ఆ యంత్రం ఇప్పుడెలా ఉంది. అందులో పనిచేస్తున్న ఎనిమిది మంది పరిస్థితి ఏంటన్నదే సమాధానం దొరకాల్సిన ప్రశ్న.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి