Photo Puzzle: ఈ ఫోటోలో పామును కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీ దిమాక్ కిర్రాకే
ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు లాంటివి సోషల్ మీడియాలో చాలానే ఉంటాయి. వీటిపై నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు. ఎలాగైనా ఓ పట్టు పట్టాలని చూస్తారు. మరి మీరు కూడా ఆ కోవకు చెందినవారు అయితే.. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త రిలాక్సేషన్ తప్పనిసరిగా కావాలి. మనకున్న ఒత్తిడితో మైండ్ బేజా ఫ్రై అవుతుంటే.. దాని నుంచి తప్పించుకునేందుకే.. సోషల్ మీడియాలో జనరల్ గేమ్స్ చాలానే వచ్చేశాయి. ఆ కోవకు చెందినవే ఫోటో పజిల్స్. ఈ ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలపై నెటిజన్లు తెగ ఆసక్తిని చూపిస్తారు. వీటిల్లో ప్రశ్నలతోనే.. సమాధానాలు నిమగ్నమై ఉన్నా.. వాటిని కనిపెట్టలేరు. మన కళ్లనే కాదు.. మన బుర్రను సైతం ఆడేసుకుంటాయి. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ మీ ముందుకు తెచ్చేశాం. మీరూ ఓ లుక్కేయండి. పైన పేర్కొన్న ఫోటోను ఓసారి గమనించారా.? ఏదో చెట్టు మొదలు.. అలాగే చుట్టూ మొక్కలు, ఆకలు, ఎండుటాకులు.. ఇలా ఆ ప్రాంతమంతా ఓ చిన్న సైజు అడవిలా కనిపిస్తోంది కదా.?
ఇక అక్కడే ఓ పాము నక్కి ఉంది. దాన్ని కనిపెట్టడమే మీ టాస్క్. అది ఎక్కడుందో మీరు చెప్పాలి. మీకున్న సమయం కేవలం 20 సెకన్లు మాత్రమే.. ఒకవేళ మీరు ఇంటిలిజెంట్ అయితే.. చిటికెలో కనిపెట్టేయగలరు. అలా కాదని.. మీకు దొరక్కపోతే నిరాశ చెందకండి.. కొంచెం తీక్షణంగా ఫోటోపై లుక్కేయండి. ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది. ఈ పజిల్‌ను 99 శాతం మంది సాల్వ్ చేయలేకపోయారు. మరి మీ సంగతేంటి.? ఓసారి ఆన్సర్ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి