Viral: గురకపెట్టి నిద్రపోతోన్న వ్యక్తి.. ఇంతలో భారీ శబ్దం.. లేచి చూసేసరికి.!
ఓ వ్యక్తి తన ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అది అర్ధరాత్రి సమయం.. ఈలోగా ఎక్కడ నుంచి ఏం పడిందో తెలియదు. ఓ భారీ శబ్దం వినిపించింది. ఏమై ఉంటుందా అని లేచి చూసేసరికి.. అతడి గుండె ఆగినంత పనైంది. ఎదురుగా కనిపించింది చూడగా

అది అర్ధరాత్రి సమయం. ఓ వ్యక్తి తన ఇంట్లో హాయిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఇంతలో ఏదో పడినట్టు భారీ శబ్దం వినిపించింది. కళ్లు తెరిచి చూసేసరికి అతడి మైండ్ బ్లాంక్ అయింది. ఎదురుగా ఓ భారీ కొండచిలువ బెడ్‌పై తనకేసే చూస్తోంది. దాన్ని చూడగానే అతడి నిద్రమత్తు వదిలిపోయింది. అంతేకాదు గుండె ఆగినంత పనైంది కూడా. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంతలో ఓ భారీ కొండచిలువ పైకప్పు ద్వారా లోపలికి ప్రవేశించింది. అంతేకాదు ఒక్క ఉదుటున అతడి బెడ్‌పై పడింది. హఠాత్తుగా భారీ శబ్దం రావడంతో ఆ వ్యక్తి లేచి చూశాడు. ఎదురుగా భారీ కొండచిలువ తననే చూస్తుండటం చూసి.. బిగ్గరగా అరుస్తూ అక్కడ నుంచి బయటకు పారిపోయాడు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించాడు. వాళ్లు అక్కడి చేరుకునేసరికి ఆ కొండచిలువ ఎంచక్కా బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటోంది. ఎంతో చాకచక్యంగా ఆ కొండచిలువను బంధించి.. జాగ్రత్తగా అడవుల్లో వదిలేశారు రెస్క్యూ టీం.
కాగా, ఆస్ట్రేలియాలో ఇలా కొండచిలువలు, పాములు ఇళ్ళల్లోకి చేరడం సర్వసాధారణం. ముఖ్యంగా కాన్బెరా, క్వీన్స్‌లాండ్ లాంటి ప్రాంతాల్లో అడవులు జన సమూహాలకు దగ్గర్లో ఉండటం వల్ల.. వేసవిలో ఎండ వేడికి, నీడ కోసం ఇలా ఇళ్ళల్లోకి ప్రవేశిస్తుంటాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి