AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది బావి కాదు.. పూల బుట్ట..! ఈ ఇంటికి సిరుల పంట..!! కారణం ఏమిటంటే..

పూల బుట్టలా తయారుచేసిన బావి చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో స్థానిక ప్రజలు మల్లయ్యను ప్రత్యేకంగా అభినందించారు .ప్రస్తుతం ఇంట్లో ఉన్న బావిని తీసివేసి బోర్లు వేయించుకొని నల్లాలు వేసుకుంటున్న ఈ రోజుల్లో ఉన్న బావిని కాపాడుకుంటూ ఆ బావిని సుందరంగా తీర్చి దిద్ది గంగమ్మకు పూజలు నిర్వహించటం అభినందనీయమని అంటున్నారు.

ఇది బావి కాదు.. పూల బుట్ట..! ఈ ఇంటికి సిరుల పంట..!! కారణం ఏమిటంటే..
Flower Pot Well
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 22, 2025 | 4:40 PM

Share

మనిషన్న తరువాత కాస్తంత కళా పోషణ ఉండాలి.. అని ఓ సిని నటుడు అన్నట్లుగా.. వైరా మున్సిపాలిటీలో నివశిస్తున్న పర్ష మల్లయ్య కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న చేద బావికి గంగమ్మ తల్లిగా పూజించి ఆకర్షణీయంగా పూల బుట్టలా తీర్చిదిద్ది తమ బావిపై తమకున్న మమకారాన్ని చాటుకు న్నారు.. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ మూడో వార్డులో నివసిస్తున్న పర్సామల్లయ్య తన ఇంట్లో గత 40 సంవత్సరాలు క్రితం బావిని నిర్మించారు మల్లయ్య దంపతుల కు వివాహమై సంతానం కలగకపోవడంతో పూజారి సలహా మేరకు తన ఇంటి ఈశాన్యంలో బావిని తవ్వి గంగమ్మకు పూజలు నిర్వహించారు. బావి తవ్విన రెండో నెలలోనే మల్లయ్య దంపతులకు సంతానం కలగడంతో అప్పటినుండి తన ఇంటిలో ఉన్న బావికి పూజలు చేయటం మొదలుపెట్టారు.

నిత్యం బావి నీటినే త్రాగు నీరుగా వాడుతున్నాడు. నాలుగు దశాబ్దాల అనంతరం ఇటీవల తన పాత ఇంటిని తొలగించి కొత్త ఇల్లును నిర్మించుకున్న తన కుటుంబానికి కలిసి వచ్చిన బావిని తీసివేయకుండా తన బావిపై ఉన్న మమకారంతో టౌన్ ప్లానింగ్ అధికారి ఇటుకల భాస్కర్ రావు సూచనల మేరకు 30 వేల రూపాయలు ఖర్చుపెట్టి బావిని పూల బుట్టలా తయారు చేశాడు. అంతేకాకుండా తన ఇంటి పై నుండి వర్షపు నీరు వృధాగా మురికి కాలువలో పడకుండా ఉండేలా రెండు గేట్ వాల్లు ఏర్పాటు చేసి స్వచ్చమైన వర్షపు నీరుఆ బావిలో పడేలా పైపులైనును ఏర్పాటు చేశాడు.

పూల బుట్టలా తయారుచేసిన బావి చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో స్థానిక ప్రజలు మల్లయ్యను ప్రత్యేకంగా అభినందించారు .ప్రస్తుతం ఇంట్లో ఉన్న బావిని తీసివేసి బోర్లు వేయించుకొని నల్లాలు వేసుకుంటున్న ఈ రోజుల్లో ఉన్న బావిని కాపాడుకుంటూ ఆ బావిని సుందరంగా తీర్చి దిద్ది గంగమ్మకు పూజలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..