AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet Murder: నువ్వు ఏం మనిషివి రా నాయనా.. పీకల దాకా తాగి.. కోరికతీర్చాలంటూ స్నేహితుడితో..

ఈ నేపద్యంలోనే రాజుకు శ్రీనివాస్‌తో స్నేహం బలంగా ఏర్పడింది..ఈనెల 19వ తేదీన..మద్యం తాగుదామని చెప్పి శ్రీనివాస్‌ను బయటకు తీసుకెళ్లాడు రాజు.. కాగా బయటకు వెళ్లిన తన భర్త ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో, అనుమానం వచ్చిన శ్రీనివాస్ భార్య.. రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది..ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ మొదలుపెట్టారు...

Siddipet Murder: నువ్వు ఏం మనిషివి రా నాయనా.. పీకల దాకా తాగి.. కోరికతీర్చాలంటూ స్నేహితుడితో..
Murder
P Shivteja
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 22, 2025 | 2:59 PM

Share

జనాలు రోజు,రోజుకు బరి తెగించిపోతున్నారు..పైకి మంచి మనుషుల్ల నటిస్తున్న.. లోపల మాత్రం సైకోలా వ్యవహరిస్తున్నారు…అసలు ఎవర్ని నమ్మోలో, ఎవర్ని నమ్మకూడదు అర్ధం కాని పరిస్థితి నెలకొంది..తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో ఓ హత్య కేసు వివరాలు అందర్నీ షాక్ కి గురిచేసాయి.. వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో బోదాసు శ్రీనివాస్ అనే వ్యక్తి.. తన భార్యా, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా కరీంనగర్ జిల్లా రేగుర్తిలోని బుడగ జంగాల కాలనీకి చెందిన పర్వతం రాజుతో కాస్త స్నేహంగా ఉండేవాడు.. ఇలా ఉండగా, వివిధ కారణాల వల్ల రాజును తన భార్య వదిలేసి వెళ్ళిపోయింది..దీంతో రాజు ఒక్కడే కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నాడు.

పొట్టకూటి కోసం పలు రకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తు ఉండేవాడు. ఈ నేపద్యంలోనే రాజుకు శ్రీనివాస్‌తో స్నేహం బలంగా ఏర్పడింది..ఈనెల 19వ తేదీన..మద్యం తాగుదామని చెప్పి శ్రీనివాస్‌ను బయటకు తీసుకెళ్లాడు రాజు.. కాగా బయటకు వెళ్లిన తన భర్త ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో, అనుమానం వచ్చిన శ్రీనివాస్ భార్య.. రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది..ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ మొదలుపెట్టారు…ఈ క్రమంలోనే, పోలీసులకు నర్సాపూర్ చౌరాస్తాలో నూతనంగా నిర్మిస్తున్న ఒక భవనంలో శ్రీనివాస్ మృతదేహం లభించింది…

అయితే, తన భర్త చివరిసారిగా రాజుతోనే బయటికి వెళ్ళాడు ఆనే విషయాన్ని శ్రీనివాస్ భార్య పోలీసులకు చెప్పటంతో..రాజును వారిదైన స్టయిల్ లో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.. పోలీసుల విచారణలో తానే శ్రీనివాస్‌ను చంపినట్టు రాజు ఒప్పుకున్నాడు..ఇద్దరూ కలిసి మద్యం తగిన తర్వాత.. మత్తులో ఉన్న తాను.. శ్రీనివాస్‌తో అసహజంగా, అసభ్యంగా ప్రవర్తంచానని పోలీసులకు రాజు చెప్పాడు..మత్తులో నుంచి తేరుకున్న శ్రీనివాస్ దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాడంతో.. ఈ విషయాన్ని బయట చెబుతాడనే భయంతో కట్టేతో కొట్టి చంపేశానని రాజు పోలీసుల ఎదుట అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..