Viral: అల్లదిగో లచ్చిందేవి.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చిపడ్డాయ్.. లెక్క చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
డబ్బుల కట్టలు వచ్చిపడాలంటే.. అదృష్టం ఉండాలి. లచ్చిందేవి ఎవరిని, ఎప్పుడు వరిస్తుందో.. చెప్పడం చాలా కష్టం. అయితే ఇక్కడొక మహిళ అనుకోకుండా ఓ తప్పు చేసింది. కానీ ఆ తప్పుతోనే ఆమెకు అదృష్టం వచ్చిపడింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

లచ్చిందేవి.. ఎప్పుడు, ఎవరికి వరిస్తుందో అస్సలు చెప్పలేం. కష్టంతో పాటు కొంచెం అదృష్టం ఉంటే.. లచ్చిందేవి మనదే అంటారు పెద్దలు. సరిగ్గా ఈ మహిళ విషయంలోనూ అదే జరిగింది. తన జీవితంలో చేయకూడని తప్పు చేసేశానని అనుకునేలోపే.. ఆ మహిళకు అదృష్టం వచ్చి వరించింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. వర్జీనియా రాష్ట్రానికి చెందిన కెల్లీ లిండ్సే కొద్దిరోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ లాటరీ షాప్‌నకు వెళ్లింది. అక్కడ తనకు నచ్చిన లాటరీ టికెట్ ఇవ్వాలని అడిగింది. అయితే ఆ షాప్‌లోని వ్యక్తి మాత్రం ఆమె అడిగిన టికెట్‌కు బదులు మనీ బ్లిట్జ్ స్క్రాచ్ ఆఫ్ కార్డు ఇచ్చాడు. మొదట్లో కాస్త చిరాకుపడ్డ లిండ్సే.. ఇక చేసేదేమీలేక సర్దుకుపోయి.. ఇంటికి వెళ్లింది. సరే.! అనుకున్న లాటరీ టికెట్ కాకపోతే ఏమి.. ఏదొకటి దక్కింది కదా.. అసలు ఇంతకీ ఈ స్క్రాచ్ కార్డులో నెంబర్ ఏముందా అని టికెట్ స్క్రాచ్ చేసి చూడగా.. కనిపించిన నెంబర్ చూసి నోరెళ్ళబెట్టింది. అలాంటి.. ఇలాంటి.. లాటరీ కాదు ఏకంగా 2 మిలియన్ డాలర్ల టాప్ ప్రైజ్ దక్కింది. తప్పు జరిగిందనుకున్న ఆమె అభిప్రాయం క్షణాల్లో మారిపోయింది. జన్మలో ఇలాంటి తప్పు జరిగి ఉండకపోవచ్చునని అనుకుంది..
లాటరీ నిబంధనల ప్రకారం.. ఆ రెండు మిలియన్ డాలర్లు సంవత్సరానికి కొంత కొంత మొత్తంలో వస్తుంటాయి. ఇక ఒకేసారి సెటిల్ చేయాలంటే.. 1.250 డాలర్లు చెల్లిస్తారు. ఇక కెల్లీ ఒన్ టైం సెటిల్మెంట్‌ను ఎంచుకుంది. ఈ డబ్బుతో కెల్లీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లచ్చిందేవి ఎలా వరిస్తుందో చెప్పడం కష్టమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి