Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో సిట్‌ దూకుడు.. చార్జిషీట్‌లో మరో 37 మంది నిందితుల పేర్లు!

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా?ఇప్పటిదాకా 50మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. 37మంది నిందితుల పేర్లను చార్జిషీట్‌లో చేర్చాలని నిర్ణయించింది సిట్. TSPSC పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్‌. త్వరలో చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తోంది.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో సిట్‌ దూకుడు.. చార్జిషీట్‌లో మరో 37 మంది నిందితుల పేర్లు!
Tspsc Paper Leak Case
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2023 | 7:10 AM

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా?ఇప్పటిదాకా 50మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. 37మంది నిందితుల పేర్లను చార్జిషీట్‌లో చేర్చాలని నిర్ణయించింది సిట్. TSPSC పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్‌. త్వరలో చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తోంది. అంతకంటే ముందు న్యాయ సలహా తీసుకుని వచ్చే వారంలో 37మంది పేర్లతో కూడిన చార్జిషీట్ దాఖలు చేసే ఆలోచనలో ఉంది. పేపర్ లీక్ కేసులో ఇప్పటిదాకా 50 మందిని అరెస్ట్‌ చేసింది సిట్‌ బృందం. వీరిలో 15మంది నిందితులు బెయిల్‌పై బయటికొచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్‌ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్ అని ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే రమేష్‌ అరెస్ట్‌తో పేపర్‌ లీక్ కేసు మరో మలుపు తిరిగింది. హైటెక్‌ పద్దతిలో అభ్యర్థులతో పరీక్ష రాయించి.. కోట్ల రూపాయలు సంపాదించినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఒప్పందం కుదుర్చుకున్న అభ్యర్ధుల కోసం.. రమేష్‌ చేసిన ప్రయత్నాలు చూసి.. అధికారులే ఆశ్చర్యపోయారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటివరకు 50 మంది అరెస్ట్ కాగా.. రమేష్ జాబితాలో చాలామందే ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. రమేష్‌ను విచారించినా కొద్ది కొత్త అంశాలు, పేర్లు, మనీ మ్యాటర్‌కు సంబంధించిన విషయాలెన్నో బయటకు వస్తూనే ఉన్నాయి.

కాగా ఏఈ ప్రశ్న పత్రాన్ని దాదాపు 80మందికి రమేష్ విక్రయించినట్టు అధికారులు ఐడెంటిఫై చేశారు. వాళ్లందర్నీ విచారిస్తే కొత్త కోణాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఖాయంగా కనిపిస్తోంది. పేపర్ లీక్‌కి ముందు నుంచే విధులకు దూరంగా ఉంటున్న రమేష్‌పై గతంలో వేర్వేరు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. రమేష్‌తో పాటు చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాళ్లందర్నీ విచారిస్తే మరెన్ని సంచనాలు వెలుగులోకి వస్తాయోనన్న చర్చ జోరందుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్