AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో దూకుడు పెంచిన సిట్.. నందకుమార్‌ భార్య చిత్రపై ప్రశ్నల వర్షం..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు రాంచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ సహా బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌,

MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో దూకుడు పెంచిన సిట్.. నందకుమార్‌ భార్య చిత్రపై ప్రశ్నల వర్షం..
Telangana Sit
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2022 | 1:15 PM

Share

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు రాంచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ సహా బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌, తుషార్‌, జగ్గూస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ని నిందితుల లిస్ట్‌లో చేర్చింది సిట్‌. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారికి నోటీసులు జారీచేస్తూ.. లోతుగా దర్యాప్తు చేస్తోంది. నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ నిన్న సిట్‌ విచారణకు హాజరయ్యారు. 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. నందు భార్య చిత్రలేఖ, ప్రతాప్‌ సోమవారం మళ్లీ విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వీరిని ప్రశ్నించారు. నందకుమార్‌తో న్యాయవాది ప్రతాప్‌గౌడ్ పలు లావాదేవీలు నిర్వహించడం సహా ఇద్దరు కలిసి ప్రయాణాలు సాగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నందకుమార్, రామచంద్ర భారతి మొబైల్‌ఫోన్లలో డేటా సేకరించారు. వారితో ప్రతాప్‌గౌడ్‌కున్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. కాగా సిట్ నోటీసులపై ఇప్పటికే ప్రతాప్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి జరిగినట్లు దర్యాప్తులో తేలగా అధికారులు నోటీసులిచ్చి ప్రశ్నించింది. సిట్‌ విచారణకు రావాల్సిన న్యాయవాది శ్రీనివాస్‌ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. న్యాయవాది శ్రీనివాస్ ముక్కుకు శస్త్రచికిత్స జరగ్గా కనీసం మూడురోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ విషయాన్ని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల తర్వాత వైద్యుడి సలహా తీసుకొని విచారణకు వచ్చే విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అటు.. రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజి రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించడంతో ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అటు.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత BLసంతోష్‌కు హైకోర్ట్‌లో ఊరట లభించింది. ఆయనపై సిట్ అధికారులు ఇచ్చిన 41A నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. డిశంబర్ 5 వరకు ఈ స్టే కొనసాగుతుంది. దీంతో ఆయనకు పెద్ద రిలీఫ్ దొరికినట్టయింది. బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉంటుందన్నారు బీజేపీ నేత రచనా రెడ్డి. ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన సిట్‌ అధికారులు.. సోమవారం జరిగే విచారణలో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో? ఎలాంటి సమాచారం రాబట్టుతారో? చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..