Telangana: అయ్యో రాజమ్మ..! అత్తను ఇంట్లో నుంచి గెంటేసిన కోడలు.. కదల్లేని స్థితిలో ఉన్నా రోడ్డుపై..

కాలికి మట్టి అంటకుండా, తిని తినక పెంచి పెద్ద చేసిన కొడుకులు, బిడ్డలు.. కన్నతల్లిని కాటికి పంపే పనిలో ఉన్నారు. ఉన్న ఆస్తిని రాపించుకొని నడిరోడ్డు మీద తల్లిని విడిచిపెట్టారు కొడుకు, కోడలు. కనీసం కూతుళ్లు కూడా కనికరం లేకుండా చూసి చూడనట్టుగా ఉన్నారు..

Telangana: అయ్యో రాజమ్మ..! అత్తను ఇంట్లో నుంచి గెంటేసిన కోడలు.. కదల్లేని స్థితిలో ఉన్నా రోడ్డుపై..
Mandamarri News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 26, 2022 | 9:48 AM

Mancherial district : కాలికి మట్టి అంటకుండా, తిని తినక పెంచి పెద్ద చేసిన కొడుకులు, బిడ్డలు.. కన్నతల్లిని కాటికి పంపే పనిలో ఉన్నారు. ఉన్న ఆస్తిని రాపించుకొని నడిరోడ్డు మీద తల్లిని విడిచిపెట్టారు కొడుకు, కోడలు.. కనీసం కూతుళ్లు కూడా కనికరం లేకుండా చూసి చూడనట్టుగా ఉన్నారు.. అడ్డాలు నాడు కొడుకులు కానీ, గడ్డాలు నాడు కొడుకులా అనే సామెత ఈ అవ్వ విషయంలో నిజమైంది. కోడలు కర్కషంగా మారి నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయింది. అడ్డుచెప్పాల్సిన కొడుకు చూసి చూడనట్టుగా ఉండటంతో.. కన్నతల్లి రోడ్డు మీద అనాథల పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మందమర్రిలో చోటుచేసుకుంది. అవ్వ పేరు రాజమ్మ.. మంచిర్యాల జిల్లా మందమర్రి మూడో జోన్‌లో నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. భర్త కాలం చేసిన తర్వాత తన ఇద్దరు కుమారులకు ఆస్తిని పంచింది.

ఈ క్రమంలో ఇద్దరు కొడుకులు చెరో నెల ఇంట్లో ఉంచుకునేందుకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకున్నారు. కానీ ఒప్పందం ప్రకారం చిన్న కొడుకు తీసుకెళ్లాల్సి ఉన్న తీసుకెళ్లకపోవడంతో ఎన్ని రోజులు మేం చూసుకోవాలి.. అయితే, ఒప్పందం ముగిసిందని పెద్ద కోడలు స్థానిక దొరల బంగ్లా వద్ద రోడ్డుపై వదిలేసి వెళ్లడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

అవ్వను.. చూసిన స్థానికులు ప్రశ్నించగా.. పెద్దకోడలు ఇక్కడ వదిలివెళ్లినట్లు రాజమ్మ రోదిస్తూ తెలిపింది. కదల్లేని స్థిలో ఉన్న వృద్దురాలిని చూసిన స్థానికులు కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

అయిన విషయం కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు కొడుకు, కోడలికి కౌన్సిలింగ్‌ చేసి తిరిగి వారి ఇంటికి చేర్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..