Hyderabad: హోటళ్లలో తింటున్నారా? అయితే, ఈ వార్తపై ఓ లుక్కేసుకోండి.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్న చందాన వ్యవహరిస్తున్నారు బేకరీలు, హోటళ్లు, స్వీట్‌ షాపుల ఓనర్లు. కొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశారు మున్సిపల్‌ అధికారులు. పైన పటారం లోన లొటారం ..

Hyderabad: హోటళ్లలో తింటున్నారా? అయితే, ఈ వార్తపై ఓ లుక్కేసుకోండి.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
Food
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:16 PM

దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్న చందాన వ్యవహరిస్తున్నారు బేకరీలు, హోటళ్లు, స్వీట్‌ షాపుల ఓనర్లు. కొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశారు మున్సిపల్‌ అధికారులు. పైన పటారం లోన లొటారం అన్న తీరుగా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని బేకరీలు, హోటళ్లు, స్వీట్‌ షాపులు. చూడడానికి ఎంతో అందంగా ఉన్నా కానీ, మెయిన్‌టెన్స్‌ చెత్తగా ఉండటంతో మున్సిపల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలో ఉన్న అన్ని హోటళ్లలో తనిఖీలు చేపట్టారు.

తిన్న వాటిని చెత్తడబ్బాలో వేయకుండా షాపు ముందే పడేయడంతో కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ స్వీట్‌ షాపులోని నూనె డబ్బాలో, చచ్చిపడి ఉన్న ఎలుకను గమనించిన అధికారులు షాపును సీజ్‌ చేశారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్న షాపుల వారికి అవగాహన కల్పిస్తూ.. మరోసారి కనిపిస్తే జరిమానాలు విధిస్తామని వార్నింగిచ్చారు.

ప్లాస్టిక్‌ కవర్ల వాడకం మీద పెద్ద యుద్ధమే మొదలు పెట్టింది సర్కారు. అయినా కూడా అన్ని షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్నారు. వీరికి జరిమానాలు వేస్తేనే వాడకుండా ఉంటారని ప్రజలు కోరుకుంటున్నారు. షాద్‌నగర్‌ పట్టణమే కాదు తెలంగాణల ఎక్కడ చూసిన ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గలేదు. అన్ని ఏరియాల్లోని మున్సిపల్‌ అధికారులు తనిఖీలు చేస్తే వాడకం తగ్గుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..