Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను ఏర్పాటుచేసింది. డిసెంబర్‌, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Train
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2022 | 10:38 AM

అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను దర్శించుకునేందుకు ఏటా లక్షలమంది వెళుతుంటారు. అయ్యప్పమాలను ధరించిన భక్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో అటువైపే వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈనేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను ఏర్పాటుచేసింది. డిసెంబర్‌, జనవరి నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

  • హైదరాబాద్ – కొల్లాం (7 సర్వీసులు): 07133 నంబర్‌ గల రైలు డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 ,16 (సోమవారాలు) తేదీలలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటుంది.
  • కొల్లాం – హైదరాబాద్ (7 సర్వీసులు): 07134 నంబర్ గల ట్రైన్‌ డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 (మంగళవారం) తేదీలలో కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్‌, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూరు, మావేలికెర, కాయంకుళం, సస్తాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.

  • సికింద్రాబాద్ – కొట్టాయం (6 సర్వీసులు): 07125 నంబర్‌ గల రైలు డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 (ఆదివారాలు) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.
  • కొట్టాయం – సికింద్రాబాద్ (6 సర్వీసులు): 07126 నంబర్‌ గల రైలు కొట్టాయం నుంచి డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 (సోమవారాలు)లలో బయలుదేరి మరుసటి రోజు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్, కోయంబత్తూరు, అలువా ఎర్నాకులం టౌన్‌ స్టేషనల్లో ఆగుతాయి.

ఇవి కూడా చదవండి
  • నర్సాపూర్ – కొట్టాయం (6 సర్వీసులు): 07119 గల రైలు సర్వీసు డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 (శుక్రవారాలు) నర్సాపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.
  • కొట్టాయం – నరసాపూర్ (6 సర్వీసులు): 07120 నంబర్‌ రైలు కొట్టాయం నుండి డిసెంబరు 3, 10, 17 31, జనవరి 7, 14 (శనివారం) తేదీలలో బయలుదేరి మరుసటి రోజు నర్సాపూర్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కోయంబత్తూరు, కోయంబత్తూరు, కోయంబత్తూరు, తిరుప్‌పూర్‌, తిరుప్‌పూర్‌, తిరుప్‌పూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..