Telangana: బతుకమ్మ చీరలు ఆర్డర్ ఉన్నట్టా!..లేనట్టా!..నేత కార్మికులకు 274 కోట్ల బిల్లు.. 100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనమిది నెలలు అయిన బతుకమ్మ చీరల ఆర్డర్ విషయం లో క్లారిటీ లేదు. అయితే కార్మికులు ఉపాధి కోల్పోయి కష్టాల్లో వేల కుటుంబాలు కూరుకుపోయాయి. ఏ మాత్రం పని లభించకపోవడంతో.. పని లేక ఖాళీ ఉంటున్నారు నేతన్నలు. రాజన్న సిరిసిల్ల తో ఇతర కార్మిక ప్రాంతాల్లో గత ప్రభుత్వం బతుకమ్మ చీరెలు తయారీకి అవకాశం కల్పించింది. ప్రతి సంవత్సరం మార్చి మే నెలలో 350 కోట్ల పైగా ఆర్డర్స్ ఇచ్చేవారు. బతుకమ్మ పండుగ ముందు కోటి చీరెలు ఆడపడుచులకు పంపిణీ చేసేవారు.
తెలంగాణా రాష్ట్రంలో బతుకమ్మ చీరల ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు చేనేత కార్మికులు. ఎందుకంటే బతుకమ్మ పండుగకు ఇంకా గడువు 50 రోజులు మాత్రమే ఉంది. సిరిసిల్ల పట్టణంలో వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందా అంటే అవునన్నట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనమిది నెలలు అయిన బతుకమ్మ చీరల ఆర్డర్ విషయం లో క్లారిటీ లేదు. అయితే కార్మికులు ఉపాధి కోల్పోయి కష్టాల్లో వేల కుటుంబాలు కూరుకుపోయాయి. ఏ మాత్రం పని లభించకపోవడంతో.. పని లేక ఖాళీ ఉంటున్నారు నేతన్నలు.
రాజన్న సిరిసిల్ల తో ఇతర కార్మిక ప్రాంతాల్లో గత ప్రభుత్వం బతుకమ్మ చీరెలు తయారీకి అవకాశం కల్పించింది. ప్రతి సంవత్సరం మార్చి మే నెలలో 350 కోట్ల పైగా ఆర్డర్స్ ఇచ్చేవారు. బతుకమ్మ పండుగ ముందు కోటి చీరెలు ఆడపడుచులకు పంపిణీ చేసేవారు. దీంతో ఆరు నెలల పాటు చీరలను తయారు చేసేవారు. అయితే.. brs ప్రభుత్వం.. గత బతుకమ్మ పండుగకు తయారు చేసిన బిల్లులు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల నిధులను విడుదల చేసింది. పాత బకాయిలు పెండింగ్ ఉండటం తో ఈ పథకం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం విధానాల కారణంగా నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డర్స్ కోసం కార్మికులకు ఎదురు చూపులు తప్పడం లేదు.ప్రభుత్వం నుండి ఆర్డర్ ఎప్పుడు వస్తుందా గంపెడాశతో నేత కార్మికులు ఉన్నారు.
గత ప్రభుత్వం బతుకమ్మ చీరెలు బకాయిలు 274 కోట్లు పెండింగ్ పెట్టడంతో వస్త్రపరిశ్రమ పూర్తిగా కుంటుపడిందని చెప్పవచ్చు. ఆటు గత ప్రభుత్వం బిల్లులు పెండింగ్ పెట్టడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి నుండి 100 కోట్ల రూపాయలు మేమే చెల్లించామని ఇంకా 174 కోట్ల రూపాయలు చెల్లిస్తామని రెండు పార్టీలు ఎవరికివారే చెప్పుకుంటున్నారు. నేత కార్మికులకు ఉపాధి చూపడంలేదు.. కానీ రెండు పార్టీలు కలసి నేత కార్మికులపై పొలిటికల్ వాయిస్ పెంచారు. ఎందుకోసం బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వలేదని brs ప్రశ్నిస్తుంది. నేతన్నల ఆత్మహత్య లకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శలు చేస్తుంది. ఈ రెండు పార్టీ లు బతుకమ్మ చీరల ఆర్డర్ పై ఆరోపణలు చేసుకుంటున్నాయి.
బతుకమ్మ పండగ ఇంకా 50 రోజుల గడువు ఉండడంతో బతుకమ్మ చీరెలు ఆర్డర్ వచ్చే పరిస్థితి లేదని ఒకవేళ వచ్చినా కోటి చీరెలు ఉత్పత్తి కష్టమేనని నేత కార్మికులు అంటున్నారు. చీరెలు ఆర్డర్ ఇవ్వకపోయినా ప్రభుత్వం నుండి వేరే ఆర్డర్ ఏదైనా ఇచ్చి నేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కార్మికులు మళ్ళీ పనుల కోసం ఎదురు చూస్తున్నారు. సిరిసిల్ల నేతన్నలు వలసలు వెళ్తున్నారు. కూలిలగా మారుతున్నారు. పనులు లేకపోవడం తో పవర్ లుమ్స్ ఇప్పటికే అమ్ముకున్నారు
గతంలోలా బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వాలని నేత కార్మికులు కోరుతున్నారు. ఆరు నెలల నుంచి పని ఉండటం లేదని చెబుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.. బతుకమ్మ చీరలు తయారీలో ఇంకా క్లారిటీ లేదని నేతన్నలు చెబుతున్నారు. తమకు ఏదయినా ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం పై ఉందని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..