AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: సోపోర్‌లో పోలీసు పోస్ట్‌ను లక్ష్యంగా ఉగ్రదాడులు.. ఒక ఉగ్రవాది హతం, సైనికుడికి గాయాలు

బసంత్‌గఢ్‌లోని మారుమూల డూడు ప్రాంతంలో ఎస్‌ఓజి, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అప్పుడు ఆకస్మికంగా కూర్చున్న జవాన్లపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ సింగ్ కి తీవ్రంగా గాయాలు అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలుగా దాడులు ప్రారంభించడంతో ఉగ్రవాదులు సంఘటనా స్థలం నుండి పారిపోయారు.

Jammu Kashmir: సోపోర్‌లో పోలీసు పోస్ట్‌ను లక్ష్యంగా ఉగ్రదాడులు.. ఒక ఉగ్రవాది హతం, సైనికుడికి గాయాలు
Jammu Kashmir
Surya Kala
|

Updated on: Aug 25, 2024 | 8:58 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో భద్రతా బలగాల బృందం ఒక ఉగ్రవాదిని హతమార్చింది. శనివారం మధ్యాహ్నం వాటర్‌గామ్ రఫీలోని పోలీస్ పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత పోలీసు సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాల సైనికుడు కూడా గాయపడ్డాడు. అంతకుముందు సోమవారం కూడా ఉధంపూర్ జిల్లాలో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఫోర్స్ , స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG)పై ఆకస్మికంగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు.

గస్తీ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్ర దాడులు

బసంత్‌గఢ్‌లోని మారుమూల డూడు ప్రాంతంలో ఎస్‌ఓజి, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అప్పుడు ఆకస్మికంగా కూర్చున్న జవాన్లపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ సింగ్ కి తీవ్రంగా గాయాలు అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలుగా దాడులు ప్రారంభించడంతో ఉగ్రవాదులు సంఘటనా స్థలం నుండి పారిపోయారు. దాడి తర్వాత, అదనపు భద్రతా దళాలను సంఘటనా స్థలానికి పంపారు. ఉగ్రవాదుల కోసం వెతకడానికి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు.

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు

కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జమ్మూకశ్మీర్‌లో ఒకదాని తర్వాత ఒకటి ఉగ్రదాడులు జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకుముందు 2014లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో ఎన్నికలు జరగలేదు.

ఇవి కూడా చదవండి

జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి దశను సెప్టెంబర్ 18న, రెండో దశ ఎన్నికలను సెప్టెంబర్ 25న, మూడో దశ ఎన్నికలను అక్టోబర్ 1న జరగనున్నాయి. అదే సమయంలో అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇలాంటి ఘటనల ద్వారా లోయలో భయాందోళన వాతావరణం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.

లోయలో అదనపు సైనికులను మోహరింపు

ఎన్నికల దృష్ట్యా లోయలో భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేస్తున్నారు. అదనపు సైనికులను మోహరిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్ సమయంలో ఉగ్రవాదుల ఉనికి తరచుగా కనిపించే ప్రాంతాలలో ప్రతి మూల మూల్లో సైనికులను మోహరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..