ఆహార వితరణ: అన్న వితరణ చేయడం లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం గొప్ప దానంగా భావిస్తారు. కృష్ణ జన్మాష్టమి రోజున పేదలకు, ఆకలి అన్నవారికి తినడానికి ఆహారం అందించడం అత్యంత పుణ్యం అని నమ్మకం. అంతేకాదు ఇంట్లో ఆహార కొరత ఉండదు. అదే సమయంలో కుటుంబంలోని అన్ని దుఃఖాలు తొలగి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది.
వెన్న దానం: లడ్డు గోపాలుడు కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం. ఈ రోజున వెన్న దానం చేయాలి. జన్మాష్టమి రోజు వెన్న దానం చేయడం వల్ల శుక్ర దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. దీనితో పాటు సంపద కూడా పెరుగుతుంది.