- Telugu News Photo Gallery Spiritual photos Sri Krishna janmashtami 2024: world famous shr krishna temple of india, know the details
Janmashtami 2024: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన కృష్ణ దేవాలయాలు.. ఇక్కడ జరిగే జన్మదినోత్సవ వేడుకలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..
శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల కోసం దేశ వ్యాప్తంగా క్రిష్నయ్య ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. కృష్ణాష్టమి ఆగస్ట్ 26వ తేదీ సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర పండుగను జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు అత్యుత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే జన్మాష్టమి వేడుకలను చూడాలంటే ఉత్తరప్రదేశ్‌లోని మధుర లేదా బృందావనానికి వెళ్లాల్సిందే అని హిందువులు భావిస్తారు. ముఖ్యంగా కన్నయ్య భక్తులు జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు.
Updated on: Aug 25, 2024 | 12:33 PM

ప్రేమ దేవాలయం: బృందావనంలోని ప్రేమ మందిరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విదేశాల నుంచి కూడా కన్నయ్య భక్తులు ఇక్కడికి వస్తుంటారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. రాధా-కృష్ణులకు అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని జగత్గురు కృపాలు మహారాజ్ నిర్మించారు. ఈ ఆలయాలన్నీ నిర్మించడానికి 11 సంవత్సరాలు పట్టింది.

మధుర : శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావించే మధుర హిందువులకు అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటి. శ్రీ కృష్ణ జన్మభూమిలో కన్నయ్య ఆలయం కృష్ణుడు జన్మించినట్లు భావిస్తున్న జైలు గది చుట్టూ నిర్మించబడింది. జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయాన్ని అందంగా అలంకరించారు. కృష్ణుడి జన్మదినాన్ని జరుపుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. అర్ధరాత్రి 'అభిషేకం' (పవిత్ర స్నానం) , 'ఆరతి'తో సహా ఆలయ ఆచారాలు నిజంగా ప్రతి ఒక్క భక్తులను మంత్రముగ్దులను చేస్తాయి.

బాంకే బిహారీ దేవాలయం: ప్రేమ మందిరంతో పాటు బాంకే బిహారీ దేవాలయం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కూడా బృందావనంలోనే ఉంది. ఠాకూర్ కి చెందిన ప్రసిద్ధి చెందిన ఏడు దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అని మీకు తెలియజేద్దాం. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. శ్రీ బాంకే బిహారీ 1863లో నిర్మించబడింది.

ద్వారకాధీశ దేవాలయం: గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయం నాలుగు ధాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని జగత్ మందిర్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుని భక్తులకు ఈ ఆలయం చాలా ముఖ్యమైనది. ద్వారక అంటే 'విముక్తి ద్వారం' - 'ద్వారం' అంటే తలుపు 'క' అంటే శాశ్వతమైన ఆనందం. సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇస్కాన్ ఆలయం: శ్రీకృష్ణుని ప్రసిద్ధ దేవాలయాలలో ఇస్కాన్ ఆలయం పేరు కూడా చేర్చబడింది. ఈ ఆలయం రాధా, కృష్ణుడికి కూడా అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని 1997 సంవత్సరంలో నిర్మించారు. ఇస్కాన్ ఆలయాల్లో హిందూ సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా ఇక్కడ ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ సంస్థకు చెందిన అనేక ఆలయాలున్నాయి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.

ఉడిపి ఆలయం : కర్నాటకలోని ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ మఠం 13వ శతాబ్దంలో మధ్వాచార్యులచే స్థాపించబడిన ప్రసిద్ధ దేవాలయం. శ్రీకృష్ణుని విగ్రహాన్ని నవగ్రహ కిటికి అని పిలువబడే 9 రంధ్రాల కిటికీ ద్వారా చూడటం వలన ఈ ఆలయం ప్రత్యేకమైనది. ఉడిపి కృష్ణ మఠంలో జన్మాష్టమి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. పిల్లలకు 'బాల కృష్ణుడి పోటీ, రథ ఊరేగింపు' వంటి ఆచారాలు ఉంటాయి.




