AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ధోతీ-కుర్తాలో ప్లేయర్స్, సంస్కృతంలో వ్యాఖ్యానం, ఇలాంటి కబడ్డీని చూశారా?

వేదం అభ్యసిస్తున్న కొంతమంది స్టూడెంట్స్ చూడడానికి, వినడానికి కొత్త్తగా ఉండే విధంగా సరికొత్త కబడ్డీ లీగ్ మ్యాచ్‌ని నిర్వహించారు. ధోతీ-కుర్తాలో ప్లేయర్స్, సంస్కృతంలో వ్యాఖ్యానం; ఇలాంటి కబడ్డీని చూశారా.. ఇలాంటి కబడ్డీ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కబడ్డీ మ్యాచ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ వేదం అభ్యసిస్తారు. వేద విద్యార్థులు ధోతీ, కుర్తాలను ధరించి పవిత్ర జంధ్యంతో కబడ్డీ ఆడారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే పోటీలు జరుగుతున్న సమయంలో కామెంటరీ కూడా సంస్కృతంలోనే జరిగింది.

Viral Video: ధోతీ-కుర్తాలో ప్లేయర్స్, సంస్కృతంలో వ్యాఖ్యానం, ఇలాంటి కబడ్డీని చూశారా?
Viral Video
Surya Kala
|

Updated on: Aug 25, 2024 | 8:36 AM

Share

సెలబ్రెటీలు, సినీ తారల క్రికెట్, కబడ్డీ లీగ్ గురించిన వినడమే కాదు చూస్తున్నారు కూడా.. అంతేకాదు స్టూడెంట్స్ కబడ్డీ ఆడడం గురించి తెలిసిందే. ఈ సమయంలో వీరి వస్త్రధారణ షార్ట్స్ వేసుకుని ఉంటారు. అయితే వేదం అభ్యసిస్తున్న కొంతమంది స్టూడెంట్స్ చూడడానికి, వినడానికి కొత్త్తగా ఉండే విధంగా సరికొత్త కబడ్డీ లీగ్ మ్యాచ్‌ని నిర్వహించారు. ధోతీ-కుర్తాలో ప్లేయర్స్, సంస్కృతంలో వ్యాఖ్యానం; ఇలాంటి కబడ్డీని చూశారా.. ఇలాంటి కబడ్డీ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.

ఈ కబడ్డీ మ్యాచ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ వేదం అభ్యసిస్తారు. వేద విద్యార్థులు ధోతీ, కుర్తాలను ధరించి పవిత్ర జంధ్యంతో కబడ్డీ ఆడారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే పోటీలు జరుగుతున్న సమయంలో కామెంటరీ కూడా సంస్కృతంలోనే జరిగింది.

సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ కబడ్డీ పోటీల్లో స్వామి వేదాంతి వేద్ విద్యాపీఠం జట్టు విజేతగా నిలిచింది. శ్రీ స్వామి వేదాంతి వేద విద్యాపీఠం, శ్రీ స్వామి నారాయణానంద తీర్థ వేద విద్యాలయం, ఇంటర్నేషనల్ చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్, శ్రీ విశ్వేశ్వరవేద భవనం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వేదవిద్యానిధి ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు ఉన్నారు. రెండో విజేతగా విశ్వేశ్వర్ వేదభవనం బృందం నిలిచింది. థర్డ్ ప్లేస్ లో శ్రీ నారాయణానంద తీర్థ వేద్ విద్యాలయ జట్టు.. నాల్గవ స్థానంలో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం జట్టు నిలిచాయి. ఈ పోటీలు జరుగుతున్న సమయంలో డాక్టర్ ఆశిష్ మణి త్రిపాఠి, డేవ్ అల్పేష్ పంకజ్‌భాయ్ సంస్కృతంలో ఆటకు సంబంధించిన వ్యాఖ్యానాన్ని చేసారు. ఇయాన్ కబడ్డీక్రీడ పోటీ అతివ్ ఆనందప్రద బలప్రద బుద్ధిప్రదా చ విద్యతే… (ఈ కబడ్డీ పోటీ అపారమైన ఆనందాన్ని , శక్తిని , తెలివిని అందించబోతోంది) వంటి పంక్తులతో వ్యాఖ్యానం ఆసక్తికరంగా సంస్కృతంలో జరిగింది.

ఇవి కూడా చదవండి

యూనివర్సిటీ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ శశీంద్ర మిశ్రా మాట్లాడుతూ ఈ విషయంపై మాట్లాడుతూ కబడ్డీ మన దేశ సంప్రదాయ క్రీడ అన్నారు. కబడ్డీ, సంస్కృత భాషలను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీలో తొలిసారిగా ఈ తరహా క్రీడా పోటీలను నిర్వహించినట్లు వెల్లడించారు. భారతీయ సంస్కృత మంత్రిత్వ శాఖ సూచనల మేరకు వేద యూనివర్శిటీ ఈ పోటీలు నిర్వహించిందని భారతీయ సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడమే ఈ క్రీడల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన చెప్పారు. అంతేకాదు ఇక నుంచి భారతీయ ప్రాచీన ఆటలను వేదాలతో జత చేసి వేద విద్యార్థులకు బోధిస్తామనిట తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..